శంకర్ సృష్టించిన అద్భుత సృష్టి 2.0 రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న కొద్దీ అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. చిత్ర యూనిట్ ట్రైలర్ అండ్ పోస్టర్స్ తో ప్రమోషన్స్ డోస్ పెంచుతోంది. ఏఆర్.రెహమాన్ అందించిన స్వరాలూ పెద్దగా ఆకట్టుకోకపోయినప్పటికీ సినిమాలో విజువల్ తో చుస్తే కొత్త రకంగా ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది. 

ఇకపోతే సినిమాలో  రెహమాన్ టాలీవుడ్ సంగీత దర్శకుడైన ఎమ్ఎమ్.కీరవాణితో ఒక పాటను పాడించిన సంగతి తెలిసిందే. కీరవాణి ఆలపించిన బుల్లిగువ్వా  అనే సాంగ్ ఎంతో స్వీట్ గా ఉందంటూ ఇప్పటికే చాలా మంది ప్రశంసించారు. ఇక కింగ్ నాగార్జున కూడా బుల్లి గువ్వా పాటకు ఫిదా అయిపోయారు. 

బుల్లిగువ్వా పాట నాకు ఎంతగానో నచ్చింది. ఎమ్ఎమ్.కీరవాణి గానం అద్భుతంగా ఉంది. ఇక ఏఆర్.రెహమాన్ సంగీతం క్లాస్ గా ఉందంటూ తనదైన శైలిలో సోషల్ మీడియా ద్వారా తెలిపారు.దాదాపు 500కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా నవంబర్ 29న రిలీజ్ కానుంది.