Asianet News TeluguAsianet News Telugu

నాగార్జున షర్ట్ పై కన్నేసిన నెటిజన్లు, కాస్ట్ తెలిస్తే.. షాక్ అవ్వాల్సిందే..

ఈమధ్య నెటిజన్ల కళ్ళన్నీ సెలబ్రిటీలు వాడుతున్న వస్తువుల పైనే ఉంటున్నాయి. వారు వేరైటీగా ఏమి వేసుకున్నా.. ఏది కొన్నా.. అది వైరల్ అవుతుంది.. వెంటనే దాని కాస్ట్ కూడా వైరల్ చేస్తుంటారు.  

Nagarjuna Bigg Boss shirt Cost Viral In Social Media JmS
Author
First Published Oct 10, 2023, 8:07 PM IST | Last Updated Oct 10, 2023, 8:07 PM IST

ఫ్యాన్స్ ఒకప్పుడు తమ అభిమాన తార సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదరు చూసేవారు. ఆతరువా కాలంలో.. వారి స్టైల్ ను ఫాలో అవుతూ వచ్చారు. ఆతరువాత ప్రస్తుత కాలంలో సెలబ్రిటీలు ఏది కొన్నా.. దాన్ని వైరల్ చేయడం మొదలు పెట్టారు. ఈక్రమంలో ఈమధ్య మన స్టార్లు వేసుకునే బట్టలు, చెప్పులు, వాచ్ లు, కార్లు.. ఇలా అన్ని లక్షలు కోట్లలోనే ఉంటున్నాయి.  ఈక్రమంలోనే రీసెంట్ గా కింగ్ అక్కినేని నాగార్జున వేసుకున్న షర్ట్ వైరల్ అవుతోంది. 

ప్రస్తుతం సినిమాలు చేసుకుంటూనే... బిగ్ బాస్' తెలుగు రియాలిటీ షోతో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నారు కింగ్ నాగార్జున. హోస్ట్​గా ఇప్పటికే నాలుగు సీజన్లను సక్సెస్ ఫుల్​గా నడిపిన నాగ్.. ఇప్పుడు 'బిగ్ బాస్ తెలుగు సీజన్ 7'తో అదరగొడుతున్నాడు. అంతే కాదు బిగ్ బాస్ లో అంతా వెరైటీ అంటూ..నే తన స్టైల్ కూడా మార్చేసి.. డిఫరెంట్ డ్రస్సింగ్ స్టైల్స్ ను మెయింటేన్ చేస్తున్నాడు. వీకెండ్ ఎపిసోడ్స్​లో మంచి టీఆర్పీ రేటింగ్స్ నమోదయ్యేలా చేస్తున్నారు. ఇక నాగార్జున ఈ సీజన్​లో ట్రెండీ కాస్ట్యూమ్స్‌తో అట్రాక్ట్ చేస్తున్నారు. కానీ ఆయన స్టైలింగ్​ను ఫాలో అవ్వాలనుకునే వారు మాత్రం, వాటి రేట్లు తెలుసుకొని నోళ్లు వెళ్లబెడుతున్నారు.

ఆరు పదుల వయసు దాటినా కూడా కుర్ర హీరోలకు పోటీ ఇస్తున్నాడు నాగార్జున. ఫిట్ నెస్ విషయంలో.. లుక్స్ విషయంలో.. స్టైల్ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వడంలేదు నాగార్జున. 30 ఏళ్లు ఉంటాయన్న నమ్ముతారేమో.. ఇలా కనిపించడం కింగ్ నాగార్జున ప్రత్యేకత. సినిమాలతోనే కాదు తన స్టైలింగ్​తోనూ ఎప్పటికప్పుడు ట్రెండ్ క్రియేట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు 'బిగ్ బాస్ తెలుగు సీజన్ 7' లోనూ ట్రెండీ కాస్ట్యూమ్స్​తో మరింత స్టైలిష్​గా, సరికొత్త లుక్ తో కనిపిస్తూ అందరినీ ఆకర్షిస్తున్నారు. అయితే రీసెంట్ గా  వీకెండ్ ఎపిసోడ్​లో నాగ్ వేసుకున్న ఒక్క షర్ట్ రేటు వైరల్ అవుతోంది. ఆ షర్ట్ రేటు తెలుసుకుని నెటిజన్లు నొరెళ్లబెడుతున్నారు. అయితే ఆషర్ట్ ధర ఎంతో తెలుసా.. . అక్షరాలా 2 లక్షలు. ఇది నిజమేనా..

 

లాస్ట్ సండే..  ఎపిసోడ్ లో నాగార్జున వేసుకున్న షర్ట్ చాలా బాగుంది. అందరి దృష్టి ఆ షర్ట్ పైనే పడింది.  ఇది లూయిస్‌ వ్యూటన్‌ అనే ఫారిన్ బ్రాండ్‌కు చెందిన లగ్జరీ షర్ట్‌. దీని ధర 2,25,406 ₹ అని తెలుస్తోంది. ముచ్చటపడి ఆ షర్ట్ కొనుక్కోవాలని అనుకున్న ఫ్యాన్స్ ఆ రేట్ చూసి ఆశ్చర్య పోతున్నారు. 'బిగ్ బాస్' హౌస్​లో నాగ్ ధరించిన షర్ట్, దాని రేటు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్​గా మారాయి. ప్రస్తుతం 99వ సినిమా చేస్తున్న నాగార్జున.. త్వరలో తన 100వ సినిమాను లైన్ లో పెట్టబోతున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios