Bigg Boss Telugu 5: సన్నీని దోషిగా తేల్చిన సభ్యులు.. కానీ సన్నీ ధైర్యాన్ని ప్రశంసించిన నాగ్.. ఇదేం ట్విస్ట్
కేక్ తిన్న సన్నీని అభినందించారు నాగార్జున. ధైర్యం ఉండాలని, ధైర్యవంతులే ఏదైనా చేయగలరని, అవకాశాలు వస్తాయని తెలిపారు. అవకాశం వచ్చినప్పుడే దాన్ని వినియోగించుకోవాలని,ధైర్యంగా స్టెప్ తీసుకోవాలన్నారు నాగ్.
బిగ్‌బాస్ తెలుగు 5(Bigg Boss Telugu 5) శనివారం 70వ ఎపిసోడ్ (69వ రోజు) ఎపిసోడ్ ఆసక్తిని రేకెత్తింది. శనివారం కావడంతో హోస్ట్ నాగార్జున ఎంట్రీ ఇచ్చారు. మొదటగా గత కెప్టెన్సీ టాస్క్ కి సంబంధించిన డిస్కషన్ ఇంటి సభ్యుల్లో జరిగింది. సన్నీ, మానస్.. సిరి వాదనపై విమర్శలు గుప్పించారు. షణ్ముఖ్ రియాక్ట్ అవుతున్న విధానంపై మాట్లాడుకున్నారు. మరోవైపు షణ్ముఖ్, సిరి, రవి సైతం సన్నీ బిహేవ్ గురించి మండిపడ్డారు. అమ్మాయిని అడ్డు పెట్టుకుని ఆడతావని ఎలా అంటారని వాళ్లు చర్చించుకున్నారు. మరోవైపు అనీ మాస్టర్.. మానస్ ప్రవర్తనపై బాధపడింది. ఆయన సంగతి నామినేషన్‌లో చూపిస్తానని తెలిపింది. ఇంతలో సువర్ణభూమికి సంబంధించి ఇచ్చిన గేమ్‌లో సన్నీ, ప్రియాంక పార్టిసిపేట్ చేశారు. ప్రియాంక విన్నర్‌గా నిలిచింది.
ఆ తర్వాత సీక్రెట్ రూమ్‌లో ఉన్న జెస్సీని ఇద్దరు డాక్టర్లు కలిశారు. ఆయన మానసిక పరిస్థితి గురించి చర్చించుకున్నారు. తలతిరగడం, నైట్ ఏదో పాకుతున్నట్టుగా ఉంటుందని, షేక్ అవుతుందని చెప్పాడు. అయితే దీనికి సంబంధించి మరింత ఎగ్జామింగ్ చేయాలని డాక్టర్లు చెప్పారు. అనంతరం నాగార్జున..జెస్సీతో మాట్లాడారు. ఇప్పుడు తనకు బాగానే ఉందని, హౌజ్‌లోకి వెళ్లేందుకు రెడీగానే ఉన్నట్టు చెప్పాడు జెస్సీ. అయితే పూర్తిస్థాయిలో రిపోర్ట్స్ వచ్చాక హౌజ్‌లోకి పంపిస్తామని చెప్పాడు నాగ్.
అనంతరం ఇంటి సభ్యులతో నాగార్జున(Nagarjuna) మాట్లాడారు. డైరెక్ట్ గా ఆయన `ఎఫ్‌ఐఆర్` గేమ్ ప్రారంభించారు. ఇందులో ఒక కంటెస్టెంట్..మరో కంటెస్టెంట్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాల్సి ఉంటుంది. సెల్‌లో పెట్టి వారు చేసిన తప్పేంటి చెప్పాలని, దోషినా కాదా అనేది ఇతర సభ్యుల నిర్ణయాల్సి ఉంటుంది. మొదట ఎక్స్ కెప్టెన్ అనీ మాస్టర్ నుంచి ప్రారంభించారు. ఆమె కాజల్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. కెప్టెన్సీ టాస్క్ లో ఫాల్త్ గేమ్ అనే చిన్న పదాన్ని ఎక్కువగా చేసిందని ఆరోపించింది. అయితే తన తరఫున వాదించాలని మానస్‌ని నియమించుకోగా, మానస్ సరిగా వాదించలేకపోయాడు, దీంతో కాజలే వాదించుకుంది. ఆమెకి మెజారిటీగా గిల్టీ ఓట్లు పడటంతో దోషిగా తేలింది.
కెప్టెన్ రవి.. సన్నీ(Sunny)పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశాడు. బ్యాడ్ బిహేవియర్, తంతా, అప్పడం అనే పదాలు వాడటం సరికాదన్నాడు. హౌజ్‌లో కొన్ని పదాలు వాడకూడదని, సనీ కోపంలో అలా మాట్లాడుతున్నాడు ఆరోపించాడు రవి. దీనికి మానస్ డిఫెన్స్ చేశాడు. దీని విషయంలో చాలా పెద్ద చర్చే జరిగింది. తాను ఆ సెన్స్ లో అనలేదని వాదించుకున్నాడు సన్నీ. అయితే వాడటం తప్పు అన్నాడు రవి. నాగార్జున కూడా రవికే సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. చివరికి వీడియోలు కూడా చూపించారు. దీంతో సన్నీని మెజారిటీ దోషిగా నిర్ణయించారు.
సన్నీ.. సిరిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశాడు. గేమ్‌ని డిస్టర్బ్ చేసిందని, అది తనకు నచ్చలేదని ఆరోపించాడు. అది తన స్ట్రాటజీ అని చెప్పింది సిరి. ఈ విషయంలో అందరు సిరి నాట్ గిల్టీ అని తేల్చారు. మరోవైపు సిరి.. సన్నీపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. తంతా అనే పదం వాడటం, అప్పడం అయిపోతావనేది, ఆడవాళ్లని అడ్డు పెట్టుకుని గేమ్ ఆడుతున్నావని అనే పదాలు నచ్చలేదని ఆరోపించింది. ఈ విషయంలో కూడా మరోసారి వీడియో చూపించాడు నాగార్జున. ఆయన వాడిన విధానం, రాంగ్ గానే ఉందని నాగార్జున తేల్చాడు. దీంతో సన్నీ గిల్టీ అనే తేల్చేశారు.
మానస్.. అనీ మాస్టర్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తూ.. తనని నామినేషన్ చేసినప్పుడు ఆమె చెప్పిన రీజల్ నచ్చలేదని, అదొక రీజనే కాదని ఆరోపించాడు. తనకు ఆ సమయంలో అంతకంటే పెద్ద రీజన్ మరెవరిపై లేదు. అందుకే నామినేట్ చేశానని తెలిపింది అనీ మాస్టర్. ఆమెని దోషి కాదని అందరు చెప్పారు. శ్రీరామ్.. ప్రియాంకపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తూ తాను ఆమె కోసం పాటలు పాడినా తనకు టిప్పు ఇవ్వలేదన్నాడు. తనని చూసి శ్రీరామ్ ఫ్లాట్ అయిపోయాడని, తాను టిప్పు ఇవ్వకపోయినా పాడతాడని, అందుకే ఇవ్వలేదని చెప్పింది. దీంతో ప్రియాంక దోషి కాదని చెప్పారు.
ప్రియాంక..మానస్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. తనపై గట్టిగా అరిచాడని ఆరోపించింది. దానికి మానస్ స్పందిస్తూ, హోటల్ టాస్క్ లో రెడీ అవడానికి చాలా టైమ్ తీసుకుందని, డ్రెస్ సెలక్షన్‌లో నాలుగైదు డ్రెస్సుల్లో తాను ఒక డ్రెస్‌ని సెలక్ట్ చేశానని, కానీ తను మాత్రం మరో డ్రెస్ వేసుకుందని అంత మాత్రానా ఎందుకు ఒపీనియన్ అడగడం అని చెప్పాడు. ఇందులో మానస్ నిర్ధోషిగానే నిలిచాడు. కాజల్.. అనీ మాస్టర్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. తనని హెగతాళి చేసిందని ఆరోపించింది. దీంతో అనీ మాస్టర్‌కి న్యూట్రల్ ఓటింగ్ పడింది.
షణ్ముఖ్.. సన్నీపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. తంతా, అప్పడం, రెస్పెక్ట్ లేకుండా మాట్లాడటం, అమ్మాయిలను అడ్డు పెట్టుకుని ఆడుతున్నారని అనడం, జస్ట్ యూట్యూబ్ వరకే అనడం కరెక్ట్ కాదని ఆరోపించాడు. దీంట్లో కూడా వీడియో చూపించాడు నాగార్జున. తన ఉద్దేశం అది కాదని, అలాంటి కామెంట్లు యూట్యూబ్ వరకే అని, రియల్ లైఫ్‌లో ఫేస్ చేయాల్సిందే అని చెప్పినట్టు సన్నీ తెలిపారు. ఈ కేసులో కూడా సన్నీ దోషిగా నిలిచాడు. మెజారిటీగా కేసులు నమోదు కావడంతో సన్నీ దోషిగా నిలిచాడు. ఆయనకు గిల్టీ బోర్డ్ వేశారు.
అనంతరం ఈ వారం నామినేషన్‌లో ఉన్న వారిలో ఒకరిని సేవ్ చేయాల్సిన టైమ్ వచ్చింది. ఇందులో బిబి హోటల్‌కి సంబంధించిన బిల్స్ వచ్చాయి. వాటిలో ఎక్కువ ఎవరికి టిప్పు వస్తే వాళ్ళు సేవ్ అయినట్టు. ఇందులో రవికి నాలుగు వందల టిప్పు, సిరికి ఏడువందల టిప్పు, మానస్‌కి ఐదు వందలు, కాజల్‌కి ఆరు వందలు, సన్నీకి వెయ్యికిపైగా టిప్పు వచ్చింది. దీంతో సన్నీ సేవ్ అయ్యాడు. ఆయనకు మిగిలిన సభ్యులు అభినందనలు తెలిపారు.
మరోవైపు చివర్లో ఫన్ క్రియేట్ చేశాడు నాగార్జున. హౌజ్‌లో ఓ కేక్ పెట్టి దాన్ని తినే అర్హత ఏ ఒక్కరికి ఉంది? అని మధ్యలో ఓ సంఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. దాన్ని రిపీట్ చేశాడు నాగార్జున. స్టేజ్‌పై తను కూడా అలాంటిదే కేక్ పెట్టి. ఇంటిసభ్యులు ఆ సమయంలో ఎలా ప్రవర్తించారో, సేమ్ వారిలాగే బిహేవ్ చేసి, ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చి నవ్వులు పూయించాడు. హీటు హీటుగా సాగిన హౌజ్‌లో నవ్వులు పూయించాడు. చివరగా దాన్ని ఆయనే తినేశాడు.
ఈ సందర్భంగా ఈ కేక్‌ని తిన్న సన్నీని ఏం చేద్దామని అడిగాడు నాగ్. దానికి అనీ మాస్టర్ స్పందిస్తూ, హౌజ్‌లో అది నేనే తినాలని అందరు నిర్ణయించారని, బిగ్‌బాస్ ఆదేశాల కొరకు వెయిట్ చేశానని తెలిపింది. అంత ఆలోచించాల్సిన అవసరం లేదని, కేక్ తిన్న సన్నీని అభినందించారు నాగార్జున. ధైర్యం ఉండాలని, ధైర్యవంతులే ఏదైనా చేయగలరని, అవకాశాలు వస్తాయని తెలిపారు. అవకాశం వచ్చినప్పుడే దాన్ని వినియోగించుకోవాలని,ధైర్యంగా స్టెప్ తీసుకోవాలన్నారు నాగ్. ఫైనల్‌గా సన్నీకి మంచి మార్కులు పడ్డాయి.
also read: షణ్ముఖ్ పై యాంకర్ ప్రశాంతి సంచలన వ్యాఖ్యలు.. అలాంటి వాళ్లకు అస్సలు ఓటేయొద్దు