షణ్ముఖ్ పై యాంకర్ ప్రశాంతి సంచలన వ్యాఖ్యలు.. అలాంటి వాళ్లకు అస్సలు ఓటేయొద్దు
కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న Bigg Boss Telugu 5 షో రసవత్తరంగా మారుతోంది. వారాలు గడిచే కొద్దీ ఇంటి సభ్యుల మధ్య పోటీ పెరుగుతోంది. ఫలితంగా సీరియస్ గా గొడవలు కూడా జరుగుతున్నాయి.
కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న Bigg Boss Telugu 5 షో రసవత్తరంగా మారుతోంది. వారాలు గడిచే కొద్దీ ఇంటి సభ్యుల మధ్య పోటీ పెరుగుతోంది. ఫలితంగా సీరియస్ గా గొడవలు కూడా జరుగుతున్నాయి. సోషల్ మీడియాలో నెటిజన్లు తమ అభిమాన కంటెస్టెంట్ కు మద్దతు తెలుపుతూ క్యాంపైన్ చేస్తున్నారు. టాస్క్ లలో పోటీ సహజమే అయినప్పటికీ.. ఇంటి సభ్యులు అనవసరంగా గొడవలు పెట్టుకుంటున్నారనే వాదన ఉంది.
ఇదిలా ఉండగా సెలెబ్రటీలు కూడా బిగ్ బాస్ 5పై తమ అభిప్రాయం తెలియజేస్తున్నారు. యాంకర్ గా రాణిస్తూనే బుల్లితెర నటిగా కూడా పాపులర్ అవుతోంది ప్రశాంతి. Prashanthi సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తరచుగా అభిమానులతో తన గ్లామరస్ ఫోటోస్ షేర్ చేస్తూ ఉంటుంది.
తాజాగా ప్రశాంతి ఇన్స్టాగ్రామ్ లో అభిమానులతో లైవ్ ద్వారా ముచ్చటించింది. నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ప్రశాంతి ఓపిగ్గా సమాధానాలు ఇచ్చింది. కొందరు నెటిజన్లు ప్రస్తుతం జరుగుతున్న బిగ్ బాస్ సీజన్ 5పై అభిప్రాయం చెప్పాలని అడిగారు. ప్రస్తుతం బిగ్ బాస్ లో పాల్గొంటున్న వారిలో చాలా మంది నాకు తెలిసిన వాళ్లే. కొంతమంది గేమ్ చాలా బాగా ఆడుతున్నారు అని కితాబిచ్చింది.
అయితే ప్రశాంతి ఎలాంటి వాళ్లకు ఓట్లేయాలో చెబుతూ షణ్ముఖ్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. యాక్టివ్ గా టాస్క్ లలో పాల్గొంటూ, గేమ్ బాగా ఆడే వారికి మాత్రమే ఓట్లేసి గెలిపించండి. కొంతమంది గేమ్ ఆడకుండా బయట కూర్చుంటున్నారు. అలాంటి వాళ్ళకి ఓట్లేయొద్దు. బయట వాళ్ళ ఫాలోయింగ్ చూసి మోసపోవద్దు అంటూ షణ్ముఖ్ పై సీరియస్ కామెంట్స్ చేసింది ప్రశాంతి.
షణ్ముఖ్ గేమ్ ఆడకుండా సైలెంట్ గా కూర్చుంటున్నాడు అనే విమర్శ ఎదుర్కొంటున్నాడు. బయట మాత్రం యుట్యూబర్ గా షణ్ముఖ్ కి మంచి ఫాలోయింగ్ ఉంది. షణ్ముఖ్, జెస్సి, సిరి హౌస్ లో ఒక గ్రూపుగా ఉంటారు. ఇటీవల జరిగిన ఎపిసోడ్ లో షణ్ముఖ్ సిరి కోసం సన్నీతో పెద్ద గొడవే పెట్టుకున్నాడు.
సిరికి, సన్నీకి మధ్య వివాదం చెలరేగగా.. సిరికి మద్దతుగా షణ్ముఖ్ వచ్చాడు. దీనితో చాలా సేపు సన్నీ, షణ్ముఖ్ మధ్య మాటల యుద్ధం సాగింది. ఏది ఏమైనా ప్రస్తుతం హౌస్ లో చాలా మంది బలమైన కంటెస్టెంట్స్ ఉన్నారు. విజేత ఎవరనేదానిపై ప్రేక్షకులు ఇప్పుడే ఒక అంచనాకు రాలేకున్నారు.
Also Read: సమంత ఫ్యాన్స్ కి కిక్కిచ్చే బజ్.. 'దూకుడు' కాంబో రిపీట్, రాజమౌళి అప్రోచ్ అయ్యారా ?