కింగ్ నాగార్జున సంక్రాంతి సెలెబ్రేషన్స్ కోసం మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లారు. గత రాత్రి చిరంజీవి ఇంటిలో జరిగిన సంక్రాంతి సంబరాలలో ఆయన పాలు పంచుకున్నారు. చిరంజీవితో పాటు ఆయన కుటుంబ సభ్యులు నాగార్జునతో పాటు వేడుకలలో పాలుపంచుకున్నారు. తమ ఇంటిలో నిర్వహిస్తున్న సంక్రాంతి వేడుకలకు చిరంజీవి, నాగార్జునను ప్రత్యేకంగా ఆహ్వానించారట. మిత్రుడు కోరికను మన్నించి గత రాత్రి నాగార్జున చిరంజీవి నివాసానికి వెళ్లారు. 

చిరంజీవి, నాగార్జున విందు వినోదాలలో పాల్గొని సంక్రాంతిని జరుపుకున్నారట. మంచి మ్యూజిక్ వింటూ, వీరి మధ్య సరదా సంభాషణలు సాగినట్లు సమాచారం. రామ్ చరణ్, వరుణ్ తేజ్, ధరమ్ తేజ్ లతో పాటు మెగా ఫ్యామిలీకి చెందిన యువకులు ఈ వేడుకలో నాగ్, చిరులతో జాయిన్ అయ్యారు. పరిశ్రమలో చిరంజీవి, నాగార్జున అత్యంత సన్నిహితంగాఉంటారు. ఆతరం స్టార్స్ లో వెంకటేష్, బాలకృష్ణలతో పోల్చితే నాగార్జున, చిరంజీవి మంచి మితృలు అని చెప్పాలి. 

ప్రస్తుతం చిరంజీవి ఆచార్య మూవీలో షూటింగ్ లో పాల్గొంటున్నారు. దర్శకుడు కొరటాల ఆచార్య మూవీ కోసం భారీ సెట్స్ వేయిస్తున్నాడు. ప్రత్యేకమైన సెట్స్ లో ఆచార్య షూటింగ్ నిరవధికంగా సాగుతుంది. ఇక నాగార్జున వైల్డ్ డాగ్ మూవీలో నటిస్తున్నారు. ఎన్ ఐ ఏ అధికారి పాత్ర చేస్తున్న నాగార్జున,  ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా కనిపిస్తారని సమాచారం.