నాగార్జున త్వరలో ఫెరఫ్యూమ్ కంపెనీ యజమానిగా కనిపించి అలరించనున్నారు. ఆ ఫెరఫ్యూమ్ కంపెనీలో ఆడవాళ్లకు మాత్రమే అనే ఎక్సక్లూజివ్ ఫెరఫ్యూమ్స్ దొరుకుతాయట. దాంతో ఎప్పుడూ అమ్మాయిలు, హడావిడితో కళకళ్లాడిపోతాడన్నమాట నాగ్. ఇంతకీ ఏ సినిమాలో ఇలా కనపడబోతున్నారు అంటారా..ఇంకే ప్రాజెక్టు మీరు ఎక్సపెక్ట్ చేసిందే మన్మధుడు 2. 

సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతున్న ఈ మన్మధుడు వరస ప్రాజెక్టులతో ఉన్నారు. వాటిల్లో మన్మధుడు 2 సినిమాపై అంచనాలే ఉన్నాయి. రీసెంట్ గా రిలీజైన టీజర్, ట్రైలర్, న్యూ స్టిల్స్ సక్సెస్ అవటంతో దర్శక,నిర్మాతలు సైతం సినిమాపై ఆశలు పెట్టుకున్నారు. దానికి తగినట్లే ప్రీ రిలీజ్ బిజినెస్ సైతం జోరుగా సాగుతోంది.

మన్మధుడు సినిమాలో ఒక పెర్ఫ్యూమ్ యాడ్ కోసం పని చేసిన నాగార్జున ఈసారి మన్మధుడు 2 లో పెర్ఫ్యూమ్ కంపెనీ కి ఓనర్ గా ఎంట్రీ ఇవ్వనున్నారనే విషయం అభిమానులను ఆనందంలో ముంచేస్తోంది. ఈ సినిమాలో నాగ్ సరసన రకుల్ ప్రధాన పాత్ర పోషిస్తుండగా మరొక పాత్రలో కీర్తి సురేష్ నటిస్తున్నట్లు తెలుస్తుంది.  అన్నపూర్ణ స్టూడియోస్, వయాకామ్ 18 మూవీస్, ఆనంది ఆర్ట్స్ సంస్థలు కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.