నాగార్జున అభిమానులకు మన్మథుడు 2 చిత్రం పండగలాంటి సినిమా అనిపిస్తోంది. తన అభిమానులు కోరుకునేలా అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉండాలని నాగార్జున భావిస్తున్నాడు.  దాదాపు 17 ఏళ్ల క్రితం విడుదలైన మన్మథుడు చిత్రం ఘనవిజయం సాధించింది. దానికి సీక్వెల్ గా యువ దర్శకుడు రాహుల్ రవీంద్రన్ మన్మథుడు 2 తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రంలోని కొన్ని స్టిల్స్ లో చిత్ర యూనిట్ విడుదల చేసింది. నాగార్జున మునుపటిలా యంగ్ లుక్ లో కనిపిస్తున్నాడు. 

ఈ చిత్రంలో నాగ్ కు జోడిగా యంగ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. ఈ చిత్రంలో మరో హీరోయిన్ కు కూడా ఆస్కారం ఉందని మొదటి నుంచి వార్తలు వస్తున్నాయి. కానీ ఆ హీరోయిన్ ఎవరనే విషయాన్ని మాత్రం చిత్రయూనిట్ ప్రకటించకుండా సస్పెన్స్ మైంటైన్ చేస్తూ వచ్చింది. నేటితో ఉత్కంఠకు తెరదించుతూ ఈ చిత్రంలో నటిస్తున్న మరో హీరోయిన్ ఎవరో ప్రకటించారు. 

మన్మథుడితో రొమాన్స్ చేస్తున్నది మరెవరో కాదు.. మహానటే.. అదే అందాల తార కీర్తి సురేష్. నాగార్జున ఒళ్ళో కీర్తి సురేష్ కూర్చుని ఉన్న స్టిల్స్ ని చిత్రయూనిట్ రిలీజ్ చేసి స్వీట్ షాక్ ఇచ్చారు. కీర్తి స్టైలిష్ లుక్ లో ఉన్న మరో ఫోటోని కూడా పంచుకున్నారు. కీర్తి సురేష్ ప్రస్తుతం మన్మథుడు 2 షూటింగ్ లో పాల్గొంటున్నట్లు దర్శకుడు రాహుల్ రవీంద్రన్ పేర్కొన్నాడు. రకుల్ ప్రీత్ సింగ్, కీర్తి సురేష్ తో ఈ చిత్రానికి కావలసినంత గ్లామర్ తోడైంది.