నాగార్జున అతడిని కూడా విడిచిపెట్టలేదు!

నాగార్జున అతడిని కూడా విడిచిపెట్టలేదు!

కింగ్ నాగార్జున ఓ పక్క సినిమాల్లో నటిస్తూనే మరోపక్క తన ఇద్దరు తనయుల సినిమాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎంతగా అంటే.. సినిమా పోస్టర్ నుండి ట్రైలర్ వరకు ఏది బయటకు రావాలన్నా..? అందులో నాగార్జున ఇన్వాల్వ్మెంట్ ఉండాల్సిందే. గతంలో నాగార్జున నటించిన 'సోగ్గాడే చిన్నినాయన' అలానే చైతు నటించిన 'రా రండోయ్ వేడుక చూద్దాం' వంటి సినిమాల విషయంలో నాగార్జున డైరెక్షన్ ఎక్కువైందనే మాటలు వినిపించాయి. ఏదేమైనా.. సినిమా అవుట్ పుట్ బాగుండడంతో ఎవరు ఈ విషయంపై పెద్దగా మాట్లాడలేదు. అయితే తాజాగా అఖిల్ నటిస్తోన్న 'హలో' సినిమా విషయంలో కూడా నాగార్జున ఇన్వాల్వ్ అవుతున్నాడని తెలుస్తోంది. విక్రమ్ కుమార్ లాంటి దర్శకుడికి ఈ విషయం పెద్దగా నచ్చడం లేదని టాక్. 

ఇండస్ట్రీలో ఉన్న పెర్ఫెక్ట్ దర్శకుల్లో విక్రమ్ ఒకడు. తను సంతృప్తి చెందే వరకు షాట్ ఓకే చేయడు. ప్రతి ఫ్రేమ్ విషయంలో పక్కాగా ఉంటాడు. అలాంటి దర్శకుడి పనిలో నాగ్ వేలు పెట్టడం చాదస్తమనే చెప్పాలి. మొన్నామధ్య ఓ ఇంటర్వ్యూలో ఎడిటింగ్ రూమ్ తాళాలు నా దగ్గరే ఉంటాయని నాగ్ కూడా చెప్పాడు. దీన్నిబట్టి సినిమా విషయంలో అతడు ఎంతగా ఇన్వాల్వ్ అవుతున్నాడో తెలుస్తోంది. దీంతో విక్రమ్ తొందరగా ఈ సినిమా చేసేసి బయట పడదామని చూస్తున్నాడట. ఇప్పుడు నాగచైతన్యతో సినిమా చేయాలనుకున్న విషయంలో కూడా విక్రమ్ పునరాలోచన చేస్తున్నట్లు వినికిడి.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos