మెగాబ్రదర్ నాగబాబు కమెడియన్ పృథ్వీపై ఫైర్ అయ్యారు. 'రేయ్ పృథ్వీ.. నువ్ నాకు ఫోన్ చెయ్' అంటూ టీవీ ఇంటర్వ్యూలో వేలు చూపించి మరీ వార్నింగ్ ఇచ్చారు. అసలు విషయంలోకి వస్తే.. నాగబాబు జనసేన పార్టీకి తనవంతు విరాళంగా పాతిక లక్షలు ఇవ్వడంతో పాటు కొడుకు వరుణ్ తేజ్ తో మరో కోటి రూపాయలు విరాళంగా ఇప్పించారు.

అయితే ఈ విరాళంపై కమెడియన్ పృథ్వీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎక్కడనుండో తీసుకొచ్చిన డబ్బుని తన కొడుకు ఖాతాలో వేసి దాన్ని జనసేన పార్టీకి ఫండ్ గా ఇచ్చారంటూ కామెంట్స్ చేశాడు.

ఈ విషయంపై నాగబాబుని ఇంటర్వ్యూలో ప్రశ్నించగా.. ఆయన ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. 'ఫండ్ గురించి పృథ్వీ కామెంట్ చేశాడా..? రేయ్ పృథ్వీ రేపు ఫోన్ చేయరా.. ఈ ప్రశ్నకి నేను నీకే సమాధానం ఇస్తాను.. పృధ్వీ నీకే చెబుతున్నా.. రేప్పొద్దున ఫోన్ చెయ్.. నా నెంబర్ నీ దగ్గర ఉంది' అంటూ వార్నింగ్ ఇచ్చారు.

మాకోసమైనా.. సమాధానం చెప్పండి అంటూ యాంకర్ అడగడంతో.. ఎవరికో ప్రూవ్ చేయాల్సిన అవసరం తనకు లేదని చెప్పిన నాగబాబు తన అకౌంట్ నుండి పాతికలక్షలు, కొడుకు ఖాతానా నుండి కోటి తీసి ఇచ్చినట్లు కావాలంటే అకౌంట్ చెక్ చేసుకోండి అంటూ చెప్పారు. అది బ్లాక్ మనీ కాదని, అకౌంటడ్క్యాష్ అంటూ స్పష్టం చేశారు.