మెగా ఫ్యామిలీలో హీరోగా రాణించలేకపోయిన నటుడు నాగబాబు. పలు చిత్రాల్లో విలన్‌గానూ కనిపించినా మెప్పించలేకపోయాడు. ఇక క్యారెక్టర్‌ ఆర్టిస్ట్ గా మారిపోయి.. టీవీ హోస్ట్ గానూ, సీరియల్స్ తోనూ టెలివిజన్‌లోనూ ఫుల్‌ బిజీగా ఉన్నాడు. 

అయితే నాగబాబు.. తన అన్నయ్య చిరంజీవి తనయుడు, మెగా పవర్‌స్టార్‌ హీరోగా ఓ లవ్‌ స్టోరీ `ఆరేంజ్‌` సినిమాని నిర్మించిన విషయం తెలిసింది. ఆ సినిమా భారీ డిజాస్టర్‌ కావడంతో భారీగా అప్పుల్లో కూరుకుపోయిన నాగబాబు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు. ఇదే విషయాన్ని అనేక సందర్భాల్లో వెల్లడిచారు. ఆ సమయంలో తన అన్నయ్య చిరంజీవి, తమ్ముడు పవన్‌ ఆదుకున్నట్టు తెలిపారు. 

ఇదిలా ఉంటే నాగబాబు అంతకంటే ముందే ఓ సారి తాను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడట. ఓ టీవీ షోలో తన కూతురు నిహారికతో కలిసి పాల్గొన్న నాగబాబు ఈ విషయాన్ని పంచుకున్నారు. ఆ సమయంలో న్యూజిలాండ్‌లోని అందరిని చంపేయాలనుకున్నాడట. ఇంతకి ఏం జరిగిందనేది చూస్తే. 

నాగబాబు ఫ్యామిలీ అంతా కలిసి ఓ సారి న్యూజిలాండ్‌ వెళ్లాడు. అక్కడ తన లాంటి నల్లకోటు వేసుకున్న వ్యక్తితో నిహారిక వెళ్ళిపోయిందట. దీంతో 20 నిమిషాలపాటు వెతికారట. ఆ చుట్టు పక్కల ఎక్కడా నిహారిక కనిపించలేదు. దీంతో ఆయనకు పిచ్చెక్కిపోయిందని, వరుణ్‌ తేజ్‌ని ఇండియాకి పంపించి తాను, ఆయన భార్య పద్మ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారట.. ఎంతో పుణ్యం చేసుకుంటే ఏంజెల్స్ లాంటి కూతురు పుడతారని, నిహారిక తన ఏంజెల్‌` అని తెలిపి షోలో అందరి ఏడిపించాడు. అయితే నిహారిక ఎలా దొరికింది, అసలు అప్పుడు ఏం జరిగిందనేది సస్పెన్స్ లో పెట్టారు. ఆ షో ఈ నెల 23న ప్రసారం కానుంది.