పవన్ కి నాగబాబు పెట్టిన ముద్దుపేరు ఎంటో తెలుసా.?

First Published 28, Mar 2018, 10:40 AM IST
Nagababu reveals pawan nick name
Highlights
పవన్ నిక్ నేమ్

పవన్ కళ్యాణ్‌కు వ్యవసాయం అంటే ఎంతో మక్కువ. ఆయనకు ఖాళీ  దొరికితే హైదరాబాద్ శివారులోని తన ఫాంహౌస్‌కు వెళ్లిపోతారు. సాధారణంగా ఏ హీరో అయినా ఒక సినిమా పూర్తయిన వెంటనే తర్వాత సినిమా ఎలాంటిది చేద్దామని ఆలోచిస్తూ ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ అలాంటి ఆలోచనల్లో మునిగి తేలడం కంటే తోటకు వెళ్లి వ్యవసాయం చేస్తూ గడపటాన్ని ఇష్టపడతారు.

పవన్ కళ్యాణ్ వ్యవహారంపై నాగబాబు ఇటీవల ఓ సందర్భంలో మాట్లాడుతూ...ఏ హీరో అయినా తాను చేసే సినిమాలకు మధ్య గ్యాప్ లభించినప్పుడు తదుపరి చేయబోయే సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ గురించి ఆలోచిస్తాడు, కానీ పవన్ కళ్యాణ్ కాస్త డిఫరెంట్, తోటపని, వ్యవసాయం చేయడాన్ని ఇష్టపడతాను. అందుకే ‘తోటరాముడు' అని ముద్దు పేరుపెట్టాను' అని తెలిపారు.

పవన్ కళ్యాణ్‌కు హైదరాబాద్ శివారులో ఎనిమిది ఎకరాల సొంత వ్యవసాయ క్షేత్రం ఉంది. అందులో రకాల ఆకు కూరలు, పండ్లు, పూల మొక్కల సాగు జరుగుతోంది. రసాయనాల అవసరం లేని గోఆధారిత సాగు ఇందులో జరుగుతోంది.

loader