తరచూ హాట్‌ కామెంట్లతో వార్తల్లో నిలిచే నాగబాబు మరోసారి హాట్‌ టాపిక్‌గా మారారు. ఆయన పంచుకున్న కొటేషన్‌ ఇప్పుడు చర్చనీయాంశమవుతుంది. 

నాగబాబు(Nagababu) మొన్నటి వరకు అజాత శతృవుగా పేరుతెచ్చుకున్నారు. కానీ ఇప్పుడు ఆయనొక ఫైర్‌ బ్రాండింగ్‌గా మారిపోయారు. మెగా ఫ్యామిలీకి, అలాగే రాజకీయాల పరంగా జనసేన పార్టీకి నాగబాబు మాటల తూటా మారిపోయారు. ఈ మధ్య కాలంలో ఆయన సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. ఏపీ రాజకీయాలపై తరచూ స్పందిస్తున్నారు. అధికార వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. 

తాజాగా నాగబాబు పంచుకున్న ఓ కోట్‌ ఇప్పుడు వైరల్‌ అవుతుంది. హాట్‌ టాపిక్‌గా మారింది. ఇందులో నాగబాబు చెబుతూ, `మంచి వాడు శత్రువుకి కూడా సహాయం చేస్తాడు. చెడ్డవాడు తోడబుట్టిన వాళ్లను కూడా ముంచుతాడు. మంచివారిని దూరం చేసుకుంటే చివరికి ముంచేవారే దొరుకుతారు` అని పేర్కొన్నారు. జోకర్‌ కోట్స్ కి సంబంధించిన ఈ కొటేషన్‌ ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. 

నాగబాబు ఎవరిని ఉద్దేశించి ఈ కోట్‌ పంచుకున్నారనేది చర్చనీయాంశమవుతుంది. ఆయన ఏపీ సీఎం జగన్‌ని ఉద్దేశించే అని ఉంటారని అంటున్నారు. మరోవైపు సొంత అన్నయ్య చిరంజీవిపైనే ఇలాంటి కామెంట్లా? అని మరికొందరు, ఇటీవల అల్లు అర్జున్‌ అల్లు రామలింగయ్య ఫోటో పంచుకున్న నేపథ్యంలో ఆయన్ని ఉద్దేశించా? అంటూ నెటిజన్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరి నాగబాబు ఈ బుల్లెట్‌ ఎవరికి దించారనేది మాత్రం ఓ మిస్టరీగానే ఉంది. 

Scroll to load tweet…

నాగబాబు.. తన తమ్ముడు, హీరో పవన్‌ కళ్యాణ్‌ స్థాపించిన జనసేన పార్టీలో ప్రధాన నాయకుడిగా ఉన్నారు. గత ఎన్నికల్లో ఆయన పోటీ కూడా చేసి ఓడిపోయారు. అయినా వైసీపీ నాయకులపై, ప్రభుత్వ లోపాలపై విమర్శలు చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. మరోవైపు నటుడిగానూ బిజీగానే ఉంటున్నారు. ఆయన టీవీ షోస్‌కి జడ్జ్ గా, సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తూ ఆకట్టుకుంటున్నారు.