జనసేన కార్యకర్తలకు అండగా ఉంటామని మరోసారి ఆ పార్టీ నేతలు నీరుపించుకున్నారు. నాలుగేళ్లక్రితం ఫ్లెక్సీలు కడుతూ ప్రమాదానికి గురై మరణించిన ఇద్దరు జనసేన కార్యకర్తల కుటుంబాలకు నాగబాబు ఆర్థిక సహాయాన్ని అందించారు. 

వివరాల్లోకి వెళితే.. జన‌సేన పార్టీ రాజ‌కీయ వ్య‌వ‌హార‌ల క‌మిటీ స‌భ్యులు, ఉభ‌య గోదావ‌రి జిల్లాల ఇన్‌ఛార్జ్‌ నాగ‌బాబు తూర్పుగోదావ‌రి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో గ్రామాల వారీగా జనల సమస్యలు తెలుసుకుంటుండగా జనసేన కార్యకర్తల మరణించిన విషయం ఆయనకు తెలిసింది. 2015లో స‌తీష్‌(19), గుండార‌పు వీర‌బాబు(20) అనే ఇద్దరు యువకులు ఫ్లెక్సీలు కడుతుండగా విద్యుత్ ఘాతానికి గురై మృతి చెందారు. 

వారి కుటుంబాలకు నాగబాబు తనవంతు సాయంగా 50వేల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించారు. బాధిత కుటుంబ సభ్యులను కలిసిన నాగబాబు వారిని ఓదార్చి జనసేన అండగా ఉంటుందని దైర్యం చెప్పారు. ఇక మంగళగిరిలో ఉన్న పవన్ కళ్యాణ్ మరో 50వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. త్వరలోనే ఆ మొత్తాన్ని బాధిత కుటుంబ సబ్యులకు అందజేయనున్నట్లు నాగబాబు తెలిపారు.