Asianet News TeluguAsianet News Telugu

నెపోటిజాన్ని సమర్థించిన నాగబాబు.. ఏమన్నాడంటే ?

టాలీవుడ్‌లోనూ అడపాదడపా నెపోటిజం గురించి చర్చ జరుగుతూనే ఉంది. ముఖ్యంగా నందమూరి, అక్కినేని, మెగా ఫ్యామిలీలో వారసత్వంగా హీరోలు వస్తున్నారని అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. వీటిపై తాజాగా మెగా ఫ్యామిలీ నుంచి నాగబాబు స్పందించారు. 

nagababu made a shocking comment on nepotism in tollywood
Author
Hyderabad, First Published Aug 28, 2020, 4:02 PM IST

ప్రస్తుతం బాలీవుడ్‌లో నెపోటిజంపై చర్చ హాట్‌ హాట్‌గా సాగుతుంది. చాలా మంది తారలు వారసత్వంగా ఇండస్ట్రీలోకి వచ్చి రాజ్యమేలుతున్నారని, కొత్త వారిని రాణివ్వడం లేదనే టాక్‌ వినిపిస్తుంది. యంగ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణం తర్వాత దీనిపై చర్చ మరింత ఊపందుకుంది. ఓ ఉద్యమంలాగానే సాగుతుంది. 

అయితే టాలీవుడ్‌లోనూ అడపాదడపా నెపోటిజం గురించి చర్చ జరుగుతూనే ఉంది. ముఖ్యంగా నందమూరి, అక్కినేని, మెగా ఫ్యామిలీలో వారసత్వంగా హీరోలు వస్తున్నారని అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. వీటిపై తాజాగా మెగా ఫ్యామిలీ నుంచి నాగబాబు స్పందించారు. ఇండస్ట్రీలో ఉన్న నెపోటిజం, తమ ఫ్యామిలీలో ఉన్న పరిస్థితిపై ఆయన మాట్లాడారు. 

పరోక్షంగా నెపోటిజాన్ని సమర్థించే ప్రయత్నం చేశారు. తన యూట్యూబ్‌ ఛానెల్‌లో నాగబాబు మాట్లాడుతూ, ఎన్టీఆర్‌ ఫ్యామిలీ గురించి చెబుతూ, ఎన్టీఆర్‌ కొడుకు కావడంతో బాలకృష్ణ స్టార్‌ అయ్యారనడం సరికాదు. ఆయనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకున్నారు. ప్రత్యేకమైన అభిమాన గణాన్ని సాధించారు. ఏఎన్నార్‌ కొడుకు కాబట్టి నాగార్జునని ఆడియెన్స్ చూడలేదు. తన గ్లామర్‌తో కింగ్‌గా ఎదిగారు. మన్మథుడిగా అలరించారు. 

జూనియర్‌ ఎన్టీఆర్‌ ఎంత కష్టపడతాడో తాను స్వయంగా చూశానని చెప్పాడు.  `అరవింద సమేత` చిత్ర షూటింగ్‌ టైమ్‌లో 44 డిగ్రీల ఎండలో షర్ట్ కూడా లేకుండా ఫైట్‌ సీన్‌ చేశాడని నాగబాబు తెలిపారు. 

మహేష్‌ గురించి మాట్లాడుతూ, మహేష్ బాబు సినిమాల్లోకి రాకముందు కాస్త లావుగానే ఉండేవాడని, హీరోగా నటించాలనుకున్నప్పుడు కేబీఆర్‌ పార్క్ లో రోజూ రన్నింగ్‌ చేసేవాడని, చాలా స్లిమ్‌గా తయారయ్యాడని చెప్పాడు. కష్టపడకపోతే ఎవరికీ చిత్రపరిశ్రమలో స్థానం ఉండదని, దేవుడి కొడుకైనా.. అతడు నచ్చకపోతే ప్రజలు తిరస్కరిస్తారని తెలిపారు. 

ఇక తన ఫ్యామిలీ గురించి చెబుతూ, తమ కుటుంబం నుంచి వచ్చిన హీరోలందరూ ఎంతో కష్టపడిన తర్వాతే తెరపైకి వచ్చారని చెప్పారు. బన్నీ, చరణ్‌, వరుణ్‌, సాయితేజ్‌, నిహారికా ఇలా అందరు కెరీర్‌ ఓసం కష్టపడుతున్నారని, నటులుగా నిరూపించుకునేందుకు నిరంతరం కష్టపడుతున్నట్టు చెప్పారు.

చిరంజీవి హీరోగా నిలదొక్కుకున్నాక, నాగబాబుని, పవన్‌ కళ్యాణ్‌ని, ఆ తర్వాత వారి వారసత్వాన్ని, అలాగే అల్లు రామలింగయ్య నుంచి అల్లు అరవింద్‌, ఆయన్నుంచి అల్లు అర్జున్‌, అల్లు శిరీష్‌ వంటి వారు హీరోలుగా వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు టాలీవుడ్‌లో టాప్‌ హీరోల్లో సగం మంది మెగా ఫ్యామిలీ నుంచే ఉన్నారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios