జబర్దస్త్ టీం సుడిగాలి సుధీర్, రాంప్రసాద్, గెటప్ శ్రీను నటించిన 3 మంకీస్ చిత్ర లోగో లాంచ్ కార్యక్రమంలో నాగబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ గెటప్ శ్రీనుని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రాంప్రసాద్ మంచి రచయిత. పంచ్ డైలాగ్స్ రాయడంతో అతడికి తిరుగులేని ప్రతిభ ఉంది. 

ఇక సుధీర్ లో హీరో అయ్యే లక్షణాలు ఉన్నాయి. వీళ్ళని చాలా దగ్గరగా గమనిస్తుంటాను కాబట్టి నాకు బాగా తెలుసు. గెటప్ శ్రీను అద్భుతమైన ప్రతిభ ఉన్న కమెడియన్. అతడు అంతర్జాతీయ స్థాయిలో కూడా పెర్ఫామ్ చేయగలడు. గెట్ శ్రీను నాకు కొడుకు కాదు.. కానీ ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే అతడిలో ఆ ప్రతిభ గమనించా. 

కానీ చిత్ర పరిశ్రమ గెటప్ శ్రీనుని సరిగా ఉపయోగించుకోవడం లేదు. శ్రీనుకు ఒక్క మంచి అవకాశం దొరికితే అద్భుతంగా నటిస్తాడు. అతడు జబర్డస్త్ లో వివిధ గెటప్ లలో ఎలా, వివిధ బాడీ లాంగ్వేజ్ లలో ఎలా నటించాడో నాకు తెలుసు. గెటప్ శ్రీనుని ఉపయోగించుకోక పోతే అది ఇండస్ట్రీకే నష్టం అని నాగబాబు అభిప్రాయపడ్డారు.