Asianet News TeluguAsianet News Telugu

ట్వీట్‌ డిలీట్‌ చేసిన నాగబాబు.. `మెగా-అల్లు` వివాదం ముగిసినట్టేనా?

ఇటీవల నాగబాబు చేసిన ట్వీట్‌ మెగా ఫ్యామిలీ దుమారం రేపిన విషయం తెలిసిందే. ఫ్యాన్స్ మధ్య పెద్ద రచ్చ అయ్యింది. ఈ నేపథ్యంలో దిగొచ్చాడు మెగా బ్రదర్‌. ట్వీట్‌ని డిలీట్‌ చేశాడు.
 

nagababu deleted his tweet is it mega allu controversy over?
Author
First Published May 18, 2024, 1:01 PM IST

మెగా బ్రదర్‌ నాగబాబు ఏదైనా స్ట్రెయిట్‌ ఫార్వర్డ్ గా ఉంటాడు. తనకు ఏది అనిపిస్తే అది చేస్తాడు. అది చాలా సార్లు వివాదాలకు దారితీస్తుంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఏపీ ఎలక్షన్స్ రోజు ఆయన చేసిన ట్వీట్‌ పెద్ద దుమారం రేపింది. అది ఎలక్షన్లలోనే కాదు, మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీలోనూ పెద్ద రచ్చ అయ్యింది. `మాతో ఉంటూ ప్రత్యర్థులకు పని చేసేవాడు మావాడైనా పరాయివాడే.. మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే ` అంటూ నాగబాబు చేసిన ట్వీట్‌ దుమారం రేపిన విషయం తెలిసిందే. 

ఇది అల్లు అర్జున్‌ని ఉద్దేశించే అని అంతా భావించారు. నాగబాబు చేసిన ట్వీట్‌ ఆ ఉద్దేశ్యంతోనే అని అర్థమవుతుంది. దీంతో అల్లు అర్మీ రెచ్చిపోయారు. నాగబాబుని టార్గెట్‌ చేస్తూ పోస్ట్ లు పెట్టారు. ఆయన్ని ట్రోల్‌ చేస్తూ వచ్చారు. అదే సమయంలో ఇది రాజకీయంగా, ఇటు మెగా, అల్లు ఫ్యామిలీలోనూ రచ్చ రచ్చ అయ్యింది. అల్లు అర్జున్‌ ఎన్నికలకు ముందు నంధ్యాల ఎమ్మెల్యే అభ్యర్థి శిల్ప రవి చంద్రరెడ్డి కోసం స్వయంగా ప్రచారంలో పాల్గొన్నారు. నంధ్యాలలోని ఆయన నివాసానికి వెళ్లి మరీ ఫ్రెండ్‌ని గెలిపించాలని ఓటర్లని, అభిమానులను అభ్యర్థించారు. బన్నీ రాకతో వేలాది మంచి అభిమానులు అక్కడికి రావడంతో కోలాహలం నెలకొంది. 

అయితే శిల్ప రవిచంద్రరెడ్డి.. బన్నీ వైఫ్‌ స్నేహారెడ్డి ఫ్రెండ్‌ భర్త. అలా వీరి మధ్య స్నేహం ఏర్పడింది. స్నేహితుడి గెలుపుకోసం వెళ్లినట్టు ఆ సందర్భంగా అల్లు అర్జున్‌ మీడియాకి వెళ్లడించాడు. తన వాళ్లు ఏ పార్టీలో ఉన్నా, పార్టీలకు అతీతంగా తన సపోర్ట్ ఉంటుందన్నారు. తన మామయ్య పవన్‌ కళ్యాణ్‌కి సపోర్ట్ చేశానని, అలాగే ఫ్రెండ్‌కి సపోర్ట్ చేసినట్టు తెలిపారు బన్నీ. అయితే మెగా ఫ్యామిలీ మనిషి అయి ఉండి, జనసేన తరఫున పవన్‌ ఎన్నికల బరిలో ఉండగా, ఆయన కోసం పిఠాపురం వెళ్లని అల్లు అర్జున్‌, ప్రత్యర్థి పార్టీ అయిన వైసీపీకి చెందిన ఫ్రెండ్‌ కోసం స్వయంగా ప్రచారం కోసం వెళ్లడమనేది పెద్ద వివాదంగా మారిన విషయం తెలిసిందే. అదే పెద్ద చర్చనీయాంశం అయ్యింది. 

ఈ నేపథ్యంలో నాగబాబు పెట్టిన పోస్ట్ మరింత అగ్గి రాజేసినట్టు అయ్యింది. వివాదం మరింత పెరిగి, పీక్లోకి వెళ్లింది. మెగాఫ్యామిలీలో కోల్డ్ వార్‌కి కారణమయ్యింది. మెగా అభిమానులు, అల్లు అభిమానుల మధ్య వార్‌ సాగింది. ఈ ట్రోలింగ్‌ ఎక్కువ కావడంతో నాగబాబు దిగొచ్చాడు. ఏకంగా తన ట్విట్టర్‌ అకౌంట్‌నే బ్లాక్‌ చేశాడు. అకౌంట్‌నే డీ యాక్టివేట్‌ చేశాడు. ఇప్పుడు మళ్లీ దీనిపై రియాక్ట్ అవుతూ మరో పోస్ట్ పెట్టాడు నాగబాబు. ఆ ట్వీట్‌ని డిలీట్‌ చేసినట్టుగా మరో ట్వీట్‌ చేశాడు. `నేను నా ట్వీట్‌ని డిలీట్‌` చేసినట్టు వెల్లడించాడు. ట్విట్టర్‌ అకౌంట్‌లో నాలుగు రోజుల క్రితం పెట్టిన పోస్ట్ లేకపోవడం గమనార్హం. దాన్నే మెగాబ్రదర్‌ డిలీట్‌ చేశారు. అయితే మెగా ఫ్యామిలీ నుంచి, అభిమానుల నుంచి పెరిగిన ఒత్తిడి మేరకు ఆయన ఈ ట్వీట్‌ చేసినట్టు తెలుస్తుంది. నష్టనివారణ చర్యల్లో భాగంగా నాగబాబు తలొగ్గినట్టు టాక్‌. మరి ఇంతటితో మెగా, అల్లు వివాదం ముగుస్తుందా? కోల్డ్ వార్‌ కంటిన్యూ అవుతుందా అనేది చూడాలి. కానీ కొంత కాలం పాటు ఆ గ్యాప్‌ అయితే ఉంటుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 

ఇదిలా ఉంటే పవన్‌ కళ్యాణ్‌ జనసేనా పార్టీ తరఫున పిఠాపురంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఆయన గెలుపుకోసం మెగా హీరోలంతా వెళ్లారు. రామ్‌చరణ్‌, సురేఖ, అల్లు అరవింద్‌, వరుణ్‌ తేజ్‌, సాయిధరమ్‌ తేజ్‌లు కూడా స్వయంగా పిఠాపురం వెళ్లి ప్రచారంలో పాల్గొన్నారు. అల్లు అర్జున్‌, అల్లు శిరీష్‌ ట్వీట్ల ద్వారా తమ సపోర్ట్ ని ప్రకటించారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios