ఓటు హక్కు రాజ్యంగా బాధ్యత అంటూ ఓటు వేయని వ్యక్తి గాడిదతో సమానం అని వివరణాత్మకంగా తెలియజేశారు సినీ నటుడు నాగబాబు. నేడు తెలంగాణ ఎన్నికల సందర్బంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓటు హక్కును వినియోగించుకున్న నాగబాబు అనంతరం మీడియాతో మాట్లాడారు. 

ఓటు హక్కు రాజ్యంగ బాధ్యత, రాజ్యాంగ హక్కు, అది ఒక వజ్రాయుధం లాంటిది నచ్చిన పార్టీని ఎన్నుకోవాలన్నా నచ్చని పార్టీని దించేయాలన్నా ఇది ఓటరు చేతుల్లో ఉన్న ఒక వజ్రాయుధం. అన్ని రకాలుగా అనుకూలంగా ఉండి ఓటు వేయగలిగే అవకాశం ఉన్నప్పటికీ ఈ రోజును సెలవు దినంగా ఎంజాయ్ చేసి ఓటు వేయకుండా నిర్లక్ష్యం చేసేవారు దుర్మార్గుడు అన్నారు. 

ఫైనల్ గా ఓటు వేయని వాడు ఒక అవినీతి రాజకీయ నాయకుడి కంటే డేంజర్ అని నా ఉద్దేశంలో ఓటు వేయని వాడు గాడిదతో సమానమని నాగబాబు తెలియజేశారు. అనంతరం ఆయన తనయుడు వరుణ్ తేజ్ కూడా అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఓటు వేయడం అందరి బాధ్యత అని వివరణ ఇచ్చారు.