కొంత కాలంగా నాగబాబు వివాదాలకు కేంద్ర బిందువు అవుతున్నారు. ఒక వర్గాన్ని, వ్యక్తులను ఉద్దేశిస్తూ ఆయన చేసే కార్యక్రమాలు, వ్యాఖ్యలు, సోషల్ మీడియా పోస్ట్లు వివాదాస్పదం అవుతున్నాయి. నాగబాబు మొదలుపెట్టిన బొమ్మ అదిరింది అనే కామెడీ షోలో ప్రదర్శించి స్కిట్ జగన్ ఫ్యాన్స్ ఆగ్రహానికి కారణం అయ్యింది. దీనితో సోషల్ మీడియా ద్వారా ఆయనపై దాడికి దిగారు. ఈ ట్రోల్స్ కి సమాధానంగా రాయల్ హెయిర్ ఆయిల్...వెంట్రుక కూడా పీకలేరు అనే ఒక వివాదాస్పద పోస్ట్ పెట్టారు. అలాగే సింహాసనంలో కుక్క కూర్చుకున్న ఫోటో పోస్ట్ చేశారు. 

ఆ రెండు పోస్ట్లు జగన్ అభిమానుల కోపం రెట్టింపు చేశాయి. దీనితో వారు తమదైన శైలిలో నాగబాబును ట్రోల్ చేయడం ఆరంభించారు. అటు జనసేన అభిమానులు నాగబాబు తీరును ఎంజాయ్ చేయడంతో పాటు ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. జగన్ ఫ్యాన్స్ సోషల్ మీడియా దాడికి సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. నాగబాబు మాత్రం ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేటట్లు కనిపించడం లేదు. 

తాజాగా నాగబాబు మరో సంచలన పోస్ట్ చేశారు. ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో 'ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించడం పిరికివాడి లక్షణం, వాడు ఒక చెంప మీద కొడితే నువ్వు వాడి మొహం పగలగొట్టు'' అని పోస్ట్ పెట్టారు. తనపై సోషల్ మీడియా దాడి చేస్తున్న వారిని ఉద్దేశించి నాగబాబు ఈ కామెంట్ చేసినట్లు అర్థం అవుతుంది. 

మీరు ట్రోల్స్ చేస్తే నేను చూస్తూ ఊరుకోనని, మీ విమర్శలకు, ట్రోల్ల్స్ కి అంతకు మించి సమాధానం ఇస్తానని పరోక్షంగా ఆయన హేటర్స్ ని హెచ్చరించినట్లు అనిపిస్తుంది. నాగబాబు దూకుడు వెనుక కారణం ఆయన తన షోకి పాపులారిటీ తెచ్చుకోవడం కోసమే అని కొందరు భావిస్తున్నారు. కొత్తగా మొదలైన బొమ్మ అదిరింది షోని ప్రేక్షకులలోకి తీసుకెళ్లడానికి ఆయన వివాదాస్పద స్కిట్ చేయించాడు అనిపిస్తుంది. ఆ షోలో జగన్ తో పాటు కొందరు హీరోలను కూడా కమెడియన్స్ ఇమిటేట్ చేయగా, మెగా హీరోల జోలికి  వెళ్ళలేదు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Gandhi 2•0`20 #NagaBabuTalks

A post shared by Naga Babu Konidela (@nagababuofficial) on Oct 8, 2020 at 4:10am PDT