`మా` ఎన్నికల అధికారి మోహన్‌బాబు రిలేటివ్..నాగబాబు సంచలన ఆరోపణలు.. నరేష్ చెత్త అధ్యక్షుడంటూ కామెంట్
`మా` ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌పై నాగబాబు సంచలన ఆరోపణలు చేశారు. ఆయన మోహన్‌బాబుకి ఫేవర్‌గా పని చేస్తున్నాడనే అనుమానం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ఒక్క రోజు ముందు నాగబాబు షాకింగ్ కామెంట్ చేయడం ఇప్పుడు `మా`లో కొత్త ట్విస్ట్ కి దారితీస్తుంది.
`మా` ఎన్నికల రచ్చ మరింతగా హీటు పెంచుతుంది. ఒక్క రోజు మాత్రమే ఎన్నికలకు సమయం ఉంది. ఈ నేపథ్యంలో ఎన్నికల అధికారిపై నాగబాబు సంచలన కామెంట్ చేశారు. ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌పై ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ఆయన మోహన్‌బాబుకి ఫేవర్‌గా పని చేస్తున్నాడనే అనుమానం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ఒక్క రోజు ముందు నాగబాబు షాకింగ్ కామెంట్ చేయడం ఇప్పుడు `మా`లో కొత్త ట్విస్ట్ కి దారితీస్తుంది.
`మా` ఎన్నికలు ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభం కాబోతున్నాయి. `మా` అధ్యక్ష పీఠం కోసం మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ పోటీ పడుతున్నారు. ఇందులో ప్రకాష్‌రాజ్‌కి మెగా ఫ్యామిలీ సపోర్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ టీవీ ఛానెల్‌లో నాగబాబు స్పందించారు. ఈ సందర్భంగా `మా` ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌పై ఆయన తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. మోహన్‌బాబుకి, మంచు విష్ణుకి ఫేవర్ గా ఉన్నాడని ఆరోపించారు.
అంతేకాదు మోహన్‌బాబు ఫ్యామిలీకి, కృష్ణమోహన్‌కి మధ్య రిలేషన్ ఉందని తెలిసిందని, అందుకే ఫేవర్‌గా చేస్తున్నాడని, అతనిపై తమకి నమ్మకం లేదన్నారు. ఈ సందర్భంగా మరొక ఎన్నికల అధికారి కావాలని ఆయన కోరుతున్నామని తెలిపారు. గతంలో పనిచేసిన ఎన్నికల అధికారి నారాయణరావుపై కూడా తమకి నమ్మకం లేదన్నారు.
ప్రకాష్‌రాజ్‌కి మెగా ఫ్యామిలీ సపోర్ట్ పై ఆయన స్పందిస్తూ, `మొదటగా ప్రకాష్‌రాజ్ అన్నయ్యని సంప్రదించి తాను `మా` అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నానని చెప్పినప్పుడు, `మా` కోసం ఆయన చేయబోతున్న కార్యక్రమాలు విని నమ్మకం కలిగింది. ఆ కార్యక్రమాలు చేయగలననే మాట తీసుకుని ఆయనకు మద్దతు ఇచ్చాం. అన్నయ్య ఒక్కసారి ఒకరికి మాటిస్తే దాన్ని వెనక్కి తీసుకోరని తెలిపారు. ఒకరికి మాటిచ్చాక నేను పోటీ చేసినా నాకు మద్దతివ్వడు` అని తెలిపారు.
అదే సమయంలో మోహన్‌బాబుతో మాట్లాడినప్పుడు కూడా అదే విషయాన్ని స్పష్టం చేశారు. ప్రకాష్‌కి తమ మద్దతు ఉంటుందని అన్నయ్య స్పష్టం చేశారని తెలిపారు నాగబాబు. `మా` కోసం ప్రకాష్‌రాజ్ పర్‌ఫెక్ట్ కార్యాచరణతో ముందుకెళ్తున్నారు. ముప్పై కోట్లతో భారీగా `మా` భవనం నిర్మించబోతున్నాడని చెప్పాడు.
also read : చిరంజీవి లేకపోతే మెగా ఫ్యామిలీలో ఏం లేదుః కోటా శ్రీనివాసరావు షాకింగ్ కామెంట్స్
మంచు విష్ణుకి సీనియర్ల సపోర్ట్ ఉందనే ప్రశ్నకి స్పందిస్తూ, సీనియర్లు.. తమని ఎవరు కలిసినా వారికి సానుకూలంగా మాట్లాడతారని, వాళ్లతో ఫోటోలు దిగినంత మాత్రాన వాళ్లకి మద్దతిస్తున్నట్టు కాదు. ఫోటోలు దిగినంత మాత్రాన ఓట్లు వేస్తారని కాదు. `మా` సభ్యులు ఎవరికి వారు వ్యక్తిత్వం ఉందని, ఎవరి వైపు ఉండరని, వాళ్లకి నచ్చిన వారికే ఓటు వేస్తారని తెలిపారు నాగబాబు. ఈ సారి ఓటింగ్ ఎక్కువశాతం పోలింగ్ అవుతుందన్నారు.
కోట శ్రీనివాస్‌రావుపై ఫైర్ అయ్యారు నాగబాబు. ఈ వయసులో ఆయన ఏం మాట్లాడుతున్నారని, ఆయనకు అవసరమా అంటూ నిలదీశారు. మానవత్వం లేకుండా కోటా శ్రీనివాసరావు, బాబూమోహన్‌పై వ్యవహరిస్తున్నారని తెలిపారు. ప్రస్తుత అధ్యక్షుడు నరేష్‌పై మండిపడ్డారు నాగబాబు. `మా`ని సర్వనాశనం చేసింది ఆయనే. `మా`లో ఇంతటి చెత్త అధ్యక్షుడు మరొకరు లేరన్నారు.