మీ అమ్మానాన్నలు మాత్రమే తెలుగువాళ్లు.. నువ్వెక్కడ పుట్టావ్, ప్రకాశ్‌రాజ్ స్థాయి ఇది: నాగబాబు వ్యాఖ్యలు
మా ఎన్నికలపై (maa elections) నాగబాబు (nagababu) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రధానితో పోరాటం తెలిసిన వ్యక్తి ప్రకాశ్‌రాజ్ అని అన్నారు. ప్రకాశ్ రాజ్ కు (prakash raj) ఉన్న ప్రత్యేకతలు విష్ణులో (manchu vishnu) లేవని.. ప్రకాశ్ రాజ్‌తో పోల్చాలంటే మోహన్ బాబును పోల్చాలని నాగబాబు అన్నారు.
మా ఎన్నికలపై (maa elections) నాగబాబు (nagababu) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రధానితో పోరాటం తెలిసిన వ్యక్తి ప్రకాశ్‌రాజ్ అని అన్నారు. ప్రకాశ్ రాజ్ కు (prakash raj) ఉన్న ప్రత్యేకతలు విష్ణులో (manchu vishnu) లేవని.. ప్రకాశ్ రాజ్‌తో పోల్చాలంటే మోహన్ బాబును పోల్చాలని నాగబాబు అన్నారు. విద్యార్థులకు ఏం కావాలో విద్యాసంస్థ నడుపుతున్న మోహన్ బాబు (mohan babu) కు తెలుసునని.. నటీనటులకు ఏం కావాలో ఆఫీసుల చుట్టూ తిరిగిన ప్రకాశ్ రాజ్‌కే తెలుసునని మెగా బ్రదర్ కామెంట్ చేశారు. నిర్మాతలతో వివాదం ప్రకాశ్ రాజ్‌కే కాదు మోహన్ బాబు కుటుంబానికి ఉన్నాయని నాగబాబు గుర్తుచేశారు.
సలీం చిత్రం విషయంలో డైరెక్టర్ వైవీఎస్ చౌదరినే (yvs chowdary) మోహన్ బాబు అదోగతి పట్టించారని.. మోహన్ బాబుకు ఎదురు తిరగలేక ఎంతో మంది వెనుతిరిగారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. మీ వివాదాల్లో తప్పెవరిదో తమకు తెలియదని.. ప్రకాశ్ రాజ్ వివాదాల్లో తప్పెవరిదో మీకు తెలియదని నాగబాబు అన్నారు. విష్ణు నువ్వు ఎక్కడ పుట్టావ్, ఎక్కడ చదువుకున్నావ్.. మీ అమ్మానాన్నలు మాత్రమే తెలుగువాళ్లు అని ఆయన దుయ్యబట్టారు. ప్రకాశ్ రాజ్, విష్ణు తెలుగు పరీక్ష రాస్తే విష్ణుకు పాస్ మార్కులు కూడా రావంటూ నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రకాశ్ రాజ్‌ని తెలుగోడంటారు.. విష్ణును తెలుగు నేర్చుకొమ్మంటారని, సినిమా జ్ఞానం, ప్రపంచ జ్ఞానం ఉన్న ప్రకాశ్ రాజ్‌కే నా మద్దతు అని నాగబాబు మరోసారి తేల్చిచెప్పారు.
ALso Read:శ్రీకృష్ణ పాత్రధారి అంటూ నరేష్ ని టార్గెట్ చేసిన నాగబాబు.. పవన్ విషయంలో తొలిసారి విష్ణుకి కౌంటర్
కాగా, నిన్న ప్రకాష్ రాజ్ ప్యానల్ నిర్వహించిన సమావేశంలో నాగబాబు మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నరేష్, విష్ణుపై నాగబాబు విమర్శలు చేశారు. 'మా' బాగా పాపులర్.. కానీ చాలా చిన్న అసోసియేషన్. మనం ప్రతి సారి ఇలా మీడియా ముందుకు రావలసిన అవసరం లేదు. కానీ ఒకే ఒక్క వ్యక్తి బ్యాడ్ హ్యాబిట్ వాళ్ళ ఈ దుస్థితి పట్టింది. ఆ వ్యక్తి ఎవరో కాదు ప్రముఖ శ్రీకృష్ణ పాత్ర ధారి అంటూ నాగబాబు నరేష్ పై పరోక్షంగా విమర్శలు చేశారు.
అతడు తుమ్మినా ప్రెస్ మీట్.. దగ్గినా ప్రెస్ మీట్.. అసలు మీడియా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఏముంది అని నాగబాబు ప్రశ్నించారు. ఇక ప్రకాష్ రాజ్ నా కంటే మా అన్నయ్యకు బాగా క్లోజ్. ప్రకాష్ రాజ్ కి , నాకు చాలా విషయాల్లో అభిప్రాయ బేధాలు వచ్చాయి. కానీ అది వేరు. మా ఎన్నికల విషయంలో ప్రకాష్ రాజ్ పర్ఫెక్ట్ ఛాయిస్. చాలా తెలివైన వాడు. ప్రకాష్ రాజ్.. బిజెపి సీనియర్ సుబ్రమణ్యస్వామితో కూడా డిబేట్ లో పాల్గొన్నారు. అంత అనుభవం లీడర్ తోనే ప్రకాష్ రాజ్ డిబేట్ లో పాల్గొన్నారు.