చిరంజీవి- గరికపాటి నరసింహారావు అంశంపై నాగబాబు మరో ట్వీట్ చేశారు. గరికపాటి నుంచి తాము క్షమాపణులు కోరలేదని... అలాంటి వ్యక్తి నుంచి ఆ మాటలు రావడమే సరికాదని నాగబాబు పేర్కొన్నారు. 

నిన్న మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలపై మరో ట్వీట్ చేశారు మెగా బ్రదర్ నాగబాబు. గరికపాటి వారు ఏదో మూడ్‌లో అలా అని వుంటారు.. ఆయన లాంటి పండితుడు అలా అనకూడదనే అన్నానే తప్పించి.. గరికపాటితో క్షమాపణలు చెప్పించుకోవాలన్న కోరిక తమకు లేదన్నారు నాగబాబు. ఏది ఏమైనా మెగా అభిమానులు ఆయనను అర్ధం చేసుకోవాలి గానీ.. ఆయనపై ఎవరూ తప్పుగా మాట్లాడొద్దని రిక్వెస్ట్ చేస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

కాగా... వివాద విషయంలోకి వెళితే... దసరా పండుగ నేపథ్యంలో హర్యానా గవర్నర్‌ దత్తాత్రేయ ఏర్పాటు చేసిన అలయ్‌ బలయ్‌ వేడుకకు మెగాస్టార్‌ చిరంజీవి, ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు, పలువురు ప్రముఖలు హాజరయ్యారు. నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. అలయ్‌ బలయ్‌కు వచ్చిన చిరంజీవితో అభిమానులు ఫోటోలు దిగారు. 

మెగాస్టార్‌తో సెల్ఫీలకు జనం ఎగబడటంతో గరికపాటి ప్రసంగానికి అంతరాయం ఏర్పడింది. దీంతో సెల్ఫీలు ఆపితేనే ప్రసంగాన్ని కొనసాగిస్తానని గరికపాటి అసహనం వ్యక్తం చేశారు చిరంజీవితో సెల్ఫీలకు జనం ఎగబడటంతో గరికపాటి ప్రసంగానికి అంతరాయం ఏర్పడింది. దీంతో సెల్ఫీలు ఆపితేనే ప్రసంగాన్ని కొనసాగిస్తానని గరికపాటి అసహనం వ్యక్తం చేశారు. 

'అక్కడ మొత్తం ఫోటో సెషన్‌ ఆగిపోవాలి. నాకేం మోహమాటం లేదు. చిరంజీవి గారికి నా విజ్ఞప్తి. ఫోటో సెషన్‌ ఆపేసి ఇక్కడకు రావాలి. లేదంటే నాకు సెలవిప్పించండి' అంటూ వెళ్లిపోతా' అంటూ గట్టిగానే చెప్పారు. వెంటనే అక్కడున్న వారు ఆయనకు సర్ధిచెప్పారు. అంతేగాక సెల్ఫీలు ఆపి గరికపాటికి చిరంజీవి క్షమాపణ చెప్పారు. గరికపాటి ప్రసంగాలంటే తనకు ఇష్టమని, ఆసక్తిగా వింటానని చెప్పారు. ఒకరోజు తమ ఇంటికి భోజనానికి రావాలని గరికపాటిని చిరంజీవి ఆహ్వానించారు.

ALso Read:అదీ చిరంజీవి ఇమేజ్ .. ఏ‘‘పాటి’’ వారికైనా ఆ’’పాటి’’ అసూయ పరి’’పాటే’’ : గరికపాటిపై నాగబాబు సెటైర్లు

మెగాస్టార్ చిరంజీవిపై అసహనం వ్యక్తం చేసిన గరికపాటి నరసింహా రావుపై మెగా బ్రదర్ నాగబాబు సెటైర్ వేశారు. ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారని జనాలు భావిస్తున్నారు. ''ఏ పాటి వాడికైనా చిరంజీవి గారి ఇమేజ్ చూస్తే ఆ పాటి అసూయ పడటం పరిపాటే'' అంటూ నాగబాబు చేసిన ట్వీట్ ప్రముఖ ప్రవచనకర్తను ఉద్దేశించి చేసినదేనని భావిస్తున్నారు. చిరంజీవిపై సీరియస్ అయిన గరికపాటిని ఉద్దేశించి నాగబాబు ఈ వ్యాఖ్యలు చేశారనే చర్చ జోరుగా సాగుతోంది.

ఈ నేపథ్యంలో రాష్ట్ర చిరంజీవి యువత అధ్యక్షుడు భవానీ కుమార్ శుక్రవారం ఫోనులో గరకిపాటితో మాట్లాడారు. చిరంజీవి పట్ల మీరు వ్యవహరించిన వైనం తమకు బాధ కలిగించిందని, అభిమానుల్లో ఆగ్రహం కలిగినా వారిని శాంతింపజేశామని ప్రవచనకర్తకు చెప్పారు. పైగా, ఎక్కడైనా మెగా ఫ్యాన్స్ ఇబ్బంది కలిగించారా? అని గరికపాటిని భవానీ కుమార్ ప్రశ్నించగా, అలాంటిదేమీ లేదని గరికపాటి సమాధానమిచ్చారు. 

అంతేకాకుండా, ఎవరూ తనను ఇబ్బంది పెట్టలేదన్నారు. చిరంజీవి ఎంతో సహృదయుడని, ఈ విషయంపై ఆయనతో మాట్లాడుతానని గరికపాటి వివరణ ఇచ్చారు. పైగా, ఈ విషయం అందరికీ చెప్పండి. ఇవాళే తప్పకుండా మాట్లాడుతాని భవానీ కుమార్‌కు తెలిపారు. వీరిద్దరి మధ్య జరిగిన సంబాషణలకు సంబంధించిన వీడియోను భవానీ కుమార్ విడుదల చేశారు. 

Scroll to load tweet…