జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోనే కొనసాగుతారని నాగబాబు క్లారిటీ ఇచ్చారు. తమ్ టార్గెట్ 2019 కాదని, 2014లో జనసేన విజయం సాధిస్తుందంటూ జోస్యం చెప్పారు. ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక పవన్ కళ్యాణ్ తిగిరి సినిమాల్లో నటిస్తారంటూ రోజుకొక వార్త పుట్టుకొస్తోంది. పవన్ కళ్యాణ్ మాత్రం తాను సినిమాలు చేసేది లేదని, రాజకీయాల్లోనే ఉంటానని కుండబద్దలు కొట్టేశారు. 

తాజగా పవన్ కళ్యాణ్ పై నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తారా అని నెటిజన్లు నాగబాబుని ప్రశ్నించారు. దీనికి సమాధానం ఇస్తూ.. పవన్ కళ్యాణ్ ఇక సినిమాలు చేయడం కుదరదు. బహుశా మేము కోరితే గెస్ట్ రోల్స్ లో నటించే అవకాశం ఉంది. అన్నయ్య చిరంజీవి రాజకీయాలు వద్దనుకుని తిరిగి సినిమాల్లోకి వచ్చేశారు. కానీ పవన్ అలా కాదు.. రాజకీయాల్లోని ఉండాలని దృఢంగా నిశ్చయించుకున్నాడు అని నాగబాబు తెలిపారు. 

నరసాపురం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన నాగబాబు ఓటమి చెందారు. తన రాజకీయ ప్రయాణం పవన్ కళ్యాణ్ తోనే కొనసాగుతుందని నాగబాబు క్లారిటీ ఇచ్చారు. తన గురించి వస్తున్న పుకార్లన్నింటికీ కార్యాచరణతోనే పవన్ సమాధానం ఇవ్వాలి.