నిర్మాత నాగవంశీపై దారుణ ట్రోలింగ్,నీవే డబ్బులా,మిగతా వాళ్లవి చిల్లర పెంకులా?
జేమ్స్ కామెరూన్ ఓ మరైన్ బయోలజీ డాక్యుమెంటరీని చూడాల్సిందిగా ఆర్డర్ వేశారు.. ఇది 3D కావడం.. ఆయన తెరకెక్కించడంతో ‘విజువల్ వండర్’ అని అంటున్నారు.

2009లో విడుదలైన అవతార్-1 చిత్రంలో అంతరిక్ష అందాలని కళ్ళకు కట్టినట్లు చూపించిన కామెరాన్ ఈసారి సముద్ర గర్భ అందాలని చూపించిన సంగతి తెలిసిందే. దాదాపు 160 దేశాల్లో 52000 స్క్రీన్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమాకి అడ్వాన్స్ బుకింగ్స్ కూడా అదే రేంజ్ లో ఉన్నాయి. ఇక భారత్ లో అయితే ఈ మూవీని థియేటర్ లో చూసేందుకు సినీ అభిమానులు ఎగపడుతున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్‌లో ఈ సినిమా పలు సెన్సేషనల్ రికార్డులు క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమాను చూసిన వారు ఆశ్చర్యపోతూ థియేటర్ల నుంచి బయటకు వస్తున్నారు.
ఈ సినిమాపై తెలుగులో ప్రముఖ నిర్మాత నాగవంశీ తనదైన రివ్యూ ఇచ్చారు. తాజాగా ఆయన అవతార్-2 సినిమాపై చేసిన ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. ‘‘జేమ్స్ కామెరూన్ ఓ మరైన్ బయోలజీ డాక్యుమెంటరీని చూడాల్సిందిగా ఆర్డర్ వేశారు.. ఇది 3D కావడం.. ఆయన తెరకెక్కించడంతో ‘విజువల్ వండర్’ అని అంటున్నారు. ఈ సినిమాను చూశాక మాస్టర్‌క్రాఫ్ట్, బ్లాక్‌బస్టర్ వంటి పదాలే అనాలి.. లేకపోతే నావీ ఒప్పుకోదు’’ అంటూ వ్యంగ్యంగా ఈ సినిమాపై రివ్యూ ఇచ్చారు. అయితే ఇప్పుడా రివ్యూ ని చాలా మంది ట్రోల్ చేస్తున్నారు.
అసలు థియేటర్ లో సినిమా ఉండగా ప్రొడ్యూసర్ సినిమాకి రివ్యూ ఇవ్వకూడదు..ఇచ్చినా possitive ఇవ్వాలి..ఈ మాత్రం తెలీకుండా ప్రొడ్యూసర్ ఎలా అయ్యావ్ ...నువ్వు సినిమా తీయడానికి పెట్టేవే డబ్బులా! మరి పక్కోడు ఏమైనా చిల్ల పెంకులతో తీస్తున్నాడా! అని డైరక్ట్ గా అడుగుతున్నారు.
కొందరు ట్రోల్ చేస్తున్న కామెరూన్ అభిమానులు ...నిర్మాత నాగవంశీని .. ఇతరుల సినిమాలు విమర్శించేముందు..నీ సినిమాల సంగతి చూసుకో. నీ సినిమాలు చాలా వరకూ రీమేక్ లే. ప్రేమమ్, భీమ్లానాయక్, బుట్టబొమ్మ వంటివి . అజ్ఞాతవాశి వంటి చిత్రాలు అయితే కాపీ అని ముద్ర వేయించుకున్నాయి అంటూ గుర్తు చేస్తున్నారు.
కాగా 13 ఏళ్ల తరువాత అవతార్-2 సినిమా రావడంతో ప్రేక్షకుల్లో మెజారిటీ శాతం ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. కానీ, ఈ సినిమాలో మొదటి పార్ట్‌లో ఉన్న క్యూరియాసిటీ మిస్ అయ్యిందని పలువురు సినీ క్రిటిక్స్ సైతం అంటున్నారు. దీంతో పలువురు నెటిజన్లు కూడా నాగవంశీ ట్వీట్‌కు సపోర్ట్ చేస్తుంటే.. మరికొందరు మాత్రం ఇలాంటి అద్భుతమైన విజువల్ వండర్ మూవీని డాక్యుమెంటరీతో పోల్చడం ఏమిటని ఆయన్ను ప్రశ్నిస్తున్నారు.