Asianet News TeluguAsianet News Telugu

యంగ్ హీరోపై సెటైర్లు.. ఈగో ఎక్కువైందని కామెంట్స్!

ఈ క్రమంలో 'నర్తనశాల' అనే సినిమాను ఇదే బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఛలో సినిమాకు రూ.5 కోట్ల పెట్టుబడి పెడితే రెట్టింపు లాభాలు వచ్చాయని టాక్. ఈసారి నర్తనశాలకు ఏకంగా రూ.15కోట్లు పెట్టుబడి పెట్టినట్లు చెప్పి షాక్ ఇచ్చాడు నాగశౌర్య

Naga shourya overconfidence on Narathanasala
Author
Hyderabad, First Published Aug 11, 2018, 4:43 PM IST

టాలీవుడ్ యంగ్ హీరోల్లో నాగశౌర్య ఒకరు. తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకునే పనిలో పడ్డాడు. కానీ ఇప్పటికీ కూడా హీరోగా సరైన అవకాశాలు దక్కించుకోలేకపోతున్నాడు. ఈ ఏడాదిలో 'ఛలో' చిత్రంతో సక్సెస్ అందుకున్న తరువాత అతడి ఆలోచనా విధానంలో మార్పులొచ్చాయి. ఈ సినిమా తన ఫ్యామిలీ నిర్మించడంతో తన తదుపరి సినిమాలు కూడా తన సొంత బ్యానర్ లో నిర్మించాలనే ఆలోచనలో పడ్డాడు.

ఈ క్రమంలో 'నర్తనశాల' అనే సినిమాను ఇదే బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఛలో సినిమాకు రూ.5 కోట్ల పెట్టుబడి పెడితే రెట్టింపు లాభాలు వచ్చాయని టాక్. ఈసారి నర్తనశాలకు ఏకంగా రూ.15కోట్లు పెట్టుబడి పెట్టినట్లు చెప్పి షాక్ ఇచ్చాడు నాగశౌర్య. ఇప్పటివరకు ఈ కుర్రహీరో నటించిన ఏ సినిమాకు కూడా రూ.10కోట్లు దాటి కలెక్షన్లు వచ్చిన దాఖలాలు లేవు. అలాంటిది పదిహేను కోట్లు ఖర్చు పెట్టడం షాక్ ఇస్తోంది. పైగా ఈ సినిమాను నాగచైతన్య సినిమా 'శైలజారెడ్డి'కి పోటీగా విడుదల చేస్తుండడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

ఓవర్ కాన్ఫిడెన్స్ కి పోయి శౌర్య ఇలా చేస్తున్నాడని, చలో సక్సెస్ తో ఈగో బాగా ఎక్కువైందని కామెంట్లు వినిపిస్తున్నాయి. 'ఛలో' తరువాత విడుదలైన 'కణం','అమ్మగారిల్లు' సినిమా ఫ్లాప్ అన్న సంగతి మర్చిపోయి రూ.15 కోట్లు ఖర్చు పెట్టారా అంటూ సెటైర్లు వేస్తున్నారు. శౌర్యపై ఇంత భారీ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయడమంటే పెద్ద రిస్క్ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. మరి ఈ సినిమాకు ఎలాంటి రిజల్ట్ దక్కుతుందో చూడాలి!

Follow Us:
Download App:
  • android
  • ios