Asianet News TeluguAsianet News Telugu

6 ప్యాక్‌ లుక్‌లో నాగశౌర్య.. విలుకాడుగా యంగ్ హీరో

నాగశౌర్య 20 సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీ ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ను సోమవారం చిత్ర నిర్మాత నారాయణ దాస్‌ నారంగ్‌ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేశారు. 6 ప్యాక్‌ లుక్‌లో లాంగ్ హెయిర్‌ ముడి వేసుకొని విలుకాడిలా కనిపిస్తున్నాడు నాగశౌర్య. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

Naga Shourya next movie First look released
Author
Hyderabad, First Published Jul 27, 2020, 10:16 AM IST

యంగ్ హీరో నాగశౌర్య మాస్ ఇమేజ్ కోసం కష్టపడుతున్నాడు. ఇప్పటికే అశ్వథ్థామ సినిమాతో బ్లాక్‌ బస్టర్ హిట్ అందుకున్న ఈ యువ కథానాయకుడు తాజాగా మరో యాక్షన్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. నాగశౌర్య 20 సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీ ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ను సోమవారం చిత్ర నిర్మాత నారాయణ దాస్‌ నారంగ్‌ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేశారు. 6 ప్యాక్‌ లుక్‌లో లాంగ్ హెయిర్‌ ముడి వేసుకొని విలుకాడిలా కనిపిస్తున్నాడు నాగశౌర్య. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

గతంలో సుమంత్ హీరోగా సుబ్రహ్మణ్యపురం అనే థ్రిల్లర్ సినిమాను తెరకెక్కించిన సంతోష్‌ జాగర్లపూడి ఈ సినిమాకు దర్శకుడు. ఈ సినిమాతో నాగశౌర్యకు జోడిగా కేతిక శర్మ నటించనుంది. ఓ ప్రాచీన విలువిద్యకు సంబంధించిన కథతో ఈ సినిమాను రూపొందిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇటీవల ప్రీ లుక్‌తో అందరి దృష్టిని ఆకర్షించిన నాగశౌర్య, ఫస్ట్‌ లుక్‌ పోస్టర్ తో సెన్సేషన్‌ సృష్టించాడు.

ఈ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను కాఫీ లాంటి చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశాడు. ఈ సందర్భంగా ఓ వీడియో మెసేజ్‌ రిలీజ్ చేసిన శేఖర్‌ కమ్ముల, నారాయణ దాస్‌ నారంగ్ సినీ రంగానికి చేసిన సేవలను కొనియాడారు. చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios