టైటిల్‌తోనే తమ సినిమా ఎంత ఎన్నోవేటివ్‌గా ఉంటుందో చెబుతున్నారు. సింపుల్‌గా, కొత్తగా ఉండే టైటిల్‌ని సినిమాకి పెట్టి క్రియేటివిటీని చాటుకుంటున్నారు. తాజాగా నాగశౌర్య అలాంటి సినిమాతోనే రాబోతున్నారు. 

తెలుగు సినిమా ఇటీవల కొంత పుంతలు తొక్కుతుంది. ఒక్క భాషకే పరిమితం కాకుండా దేశంలోని ప్రముఖ భాషల ఆడియెన్స్ ని అలరించేలా మన తెలుగులో సినిమాలు రూపొందుతున్నాయి. సహజత్వానికి పెద్ద పీఠ వేస్తున్నారు. అదే సమయంలో ఊహించని విధంగా ఫిక్షన్‌తో భారీ విజువల్‌ వండర్‌ లను క్రియేట్‌ చేస్తున్నారు. ఆడియెన్స్ ని అలరించేందుకు కొత్త దారులు వెతుకుతున్నారు. 

ఈ క్రమంలో టైటిల్‌ విషయంలో చాలా ఇన్నోవేషన్‌ చూపిస్తున్నారు. టైటిల్‌తోనే తమ సినిమా ఎంత ఎన్నోవేటివ్‌గా ఉంటుందో చెబుతున్నారు. సింపుల్‌గా, కొత్తగా ఉండే టైటిల్‌ని సినిమాకి పెట్టి క్రియేటివిటీని చాటుకుంటున్నారు. తాజాగా నాగశౌర్య అలాంటి సినిమాతోనే రాబోతున్నారు. ఆయన ప్రస్తుతం రీతూ వర్మతో కలిసి లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. దీపావళి పండుగని పురస్కరించుకుని ఈ చిత్ర టైటిల్‌ని శుక్రవారం ప్రకటించారు. దీనికి `వరుడు కావలెను` అనే భిన్నమైన టైటిల్‌ పెట్టడం విశేషం. 

ఈ సందర్భంగా ఓ గ్లింప్స్ పేరుతో ఓ వీడియోని విడుదల చేశారు. ఈ వీడియోలో నాగశౌర్య, రీతువర్మ ఆకట్టుకుంటున్నారు. దీనికి విశాల్ చంద్రశేఖర్ అందించిన నేపథ్య సంగీతం మరింత వన్నె తెచ్చింది. ఈ సందర్భంగా దర్శకురాలు మాట్లాడుతూ, `వరుడు కావలెను` అనే పేరు చిత్ర కథకు యాప్ట్ అని పేర్కొంది. ప్రస్తుతం చిత్ర షూటింగ్‌  హైదరాబాద్ లో జరుపుకుంటోంది. హీరోహీరోయిన్లు, ప్రధాన తారాగణం ఇందులో పాల్గొంటుందని తెలిపారు. వచ్చే ఏడాది సమ్మర్‌లో సినిమాని విడుదల చేయబోతున్నారు.