2018లో ఎలాంటి అంచనాలు లేకుండా ఛలో సినిమాతో వచ్చి బిగ్గెస్ట్ హిట్ అందుకున్న కుర్ర హీరో నాగ శౌర్య. అనంతరం అతని నుంచి వచ్చిన సినిమాలు  అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయాయి. అయితే మరోసారి తన సొంత ప్రొడక్షన్ అయిన 'ఐరా' లోనే లోనే డిఫరెంట్ మూవీని రెడీ చేశాడు. క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన ఆ సినిమా మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఐరా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై శంక‌ర్ ప్ర‌సాద్ ముల్పూరి స‌మ‌ర్ప‌ణ‌లో ఉషా ముల్పూరి నిర్మాత‌గా రూపొందుతోన్న చిత్రం `అశ్వ‌థ్థామ‌`. ఆ మధ్య హోమ్ బ్యానర్ లోనే నర్తనశాల సినిమాని నిర్మించిన నాగ శౌర్య ఊహించని విధంగా నష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక ఛలో సినిమాతో వచ్చిన లాభాలని ఇప్పుడు అశ్వద్ధామపై పెట్టుబడిగా పెట్టాడు.  విడుదలైన టీజర్, ట్రైలర్స్ కి పాజిటివ్ రెస్పాన్స్ అయితే వచ్చింది.

ఛలో సినిమాని సొంతంగా రాసుకొని హిట్టందుకున్న నాగ శౌర్య అదే తరహాలో అశ్వద్ధామ కథను రాసుకొని హిట్టు కొట్టాలని చూస్తున్నాడు. మరీ ఈ సెంటిమెంట్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. ఈ సినిమా కోసం భారీగా ఖర్చు చేసినట్లు అర్ధమవుతోంది. ఈ సినిమాతో నాగ శౌర్య తప్పనిసరిగా హిట్టు కొట్టి తీరాల్సిందే. ఓ విధంగా డేంజర్ జోన్ లో ఉన్నాడని టాక్ వస్తోంది. సో అశ్వద్ధామ పై అటు ఆర్థిక పరంగానే కాకుండా కెరీర్ పరంగా కూడా ఈ రీజల్ట్ కీలకంగా మారింది.  ఈ సినిమాటతో ర‌మ‌ణ తేజ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. మెహ‌రీన్ హీరోయిన్‌గా న‌టిస్తుంది.