యంగ్ హీరో నాగ శౌర్య లేటెస్ట్ లుక్ వైరల్ అవుతుంది. ఆయన సోషల్ మీడియాలో పంచుకున్న లేటెస్ట్ ఫోటో ఆసక్తి రేపుతోంది. ఒక విధంగా చెప్పాలంటే ఆయన గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. నాగ శౌర్య లుక్ చూసిన నెటిజెన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. గత ఏడాది నాగ శౌర్య అశ్వథామ చిత్రంలో నటించారు. ఆ సినిమాకు కథను నాగ శౌర్య సమకూర్చడం జరిగింది. అశ్వథామ చిత్రం యావరేజ్ టాక్ అందుకుంది. 


ఇక ఆయన నటించిన లేటెస్ట్ మూవీ లక్ష్య కోసం ఆయన లుక్ పూర్తిగా మార్చేశారు. సిక్స్ ప్యాక్ బాడీలో కాకరేపారు. స్పోర్ట్స్ నేపథ్యంలో లక్ష్య తెరకెక్కుతుండగా... నాగ శౌర్య ఆర్చర్ గా కనిపించనున్నాడు. ఈ మూవీపై పరిశ్రమలో భారీ అంచనాలున్నాయి . నిర్మాతగా, రచయితగా మరియు హీరోగా నాగ శౌర్య దూసుకుపోతున్నారు. నాగ శౌర్య లక్ష్య సినిమాతో పాటు వరుడు కావలెను అనే మరో చిత్రాన్ని ప్రకటించారు. ఆ చిత్రం షూటింగ్ జరుపుకుంటుంది. 

ఛలో మూవీ తరువాత నాగ శౌర్య సరైన హిట్ కొట్టలేదు. 2019లో సమంత ప్రధాన పాత్రలో ఓ బేబీ మూవీలో నాగ శౌర్య నటించడం జరిగింది. ఆ మూవీ భారీ విజయం అందుకున్నప్పటికీ క్రెడిట్ కేవలం సమంతకు దక్కింది. దీనితో భారీ హిట్ కొట్టి ఫార్మ్ లోకి రావాలని అనుకుంటున్నాడు నాగ శౌర్య.