న ‘రంగబలి’ సక్సెస్ ప్రెస్ మీట్‌లో ఓ సీనియర్ జర్నలిస్ట్ ప్రశ్నించారు. దీనికి నాగశౌర్య స్పందిస్తూ.. 

నాగ శౌర్య , యుక్తి తరేజా హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా రంగబలి. ఈ సినిమా ఫస్ట్ లుక్, ట్రైలర్ విడులైనప్పటి నుంచి బజ్ క్రియేట్ అయ్యింది.ముఖ్యంగా ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా కమెడియన్ సత్య చేసిన స్పూఫ్ వీడియో కూడా సినిమా పై అంచనాలను క్రియేట్ చేసింది. ప్రముఖ జర్నలిస్టులు ఏబీఎన్ రాధాకృష్ణ, గ్రేట్ ఆంధ్ర మూర్తి, జాఫర్, సురేష్ కొండేటి, దేవీ నాగవల్లీలను ఇమిటేట్ చేస్తూ కమెడియన్ సత్య ఈ ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూతోనే సినిమాకు మంచి ప్రచారం లభించింది. పవన్ బాసంశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన రంగబలి సినిమా ఈ శుక్రవారం (జూలై 7వ తేదీ) విడుదలైంది. సినిమాకు డివైడ్ టాక్ వచ్చింది. అయితే చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ఎరేంజ్ చేసారు. అయితే అక్కడ ఈ స్పూఫ్ విషయం ప్రస్తావనకు వచ్చింది. 

ఇలా జర్నలిస్టులను అవమానించడం పద్దతేనా అని ఈరోజు హైదరాబాద్‌లో నిర్వహించిన ‘రంగబలి’ సక్సెస్ ప్రెస్ మీట్‌లో ఓ సీనియర్ జర్నలిస్ట్ ప్రశ్నించారు. దీనికి నాగశౌర్య స్పందిస్తూ.. తామెవరినీ అవమానించలేదని, వారి మీద అభిమానంతోనే అలా స్ఫూఫ్ చేశామని, ఒక వేళ తాము చేసిన ఇంటర్వ్యూ వల్ల వాళ్లు హర్ట్ అయ్యి ఉంటే క్షమాపణలు చెబుతున్నామని అన్నారు. అలాగే మీడియావారు, తాము ఒకే కుటుంబం అని భావిస్తున్నట్లు చెప్పారు. ఇక తాము స్ఫూఫ్ పై సురేష్ కొండేటి, రాధాకృష్ణ అభిప్రాయం తీసుకుంటే వారు పాజిటివ్ గా స్పందించారని తెలియచేసారు. అలాగే మీడియావారు చంద్రబాబు, కేసీవంటి ప్రముఖులను స్పూఫ్ చేయలేదా అని ప్రశ్నించారు.

ఇక 'రంగబలి' సినిమా ఫస్టాఫ్ వరకు అదే రేంజ్‌ కామెడీని పండించి ప్రేక్షకులను మెప్పించింది. కమర్షియల్ కథకు కామెడీ మిక్స్ చేసి అందరికీ వినోదాన్ని పంచారు దర్శకుడు. సత్య కామెడీతో థియేటర్లలో నవ్వులు పూయించారు. నాగ శౌర్య తర్వాత సినిమాకు ప్రాణం పోసింది సత్య అనే చెప్పాలి. సెకండాఫ్‌లో పూర్తి భిన్నంగా సాగుతుంది. దాంతో ప్రేక్షకుడికి కొంత నిరాశ కలగక తప్పదు. అసలు ఫస్టాఫ్‌ కు దర్శకత్వం వహించిన పవన్.. సెకండాఫ్‌ కూడా తీశాడా అనే అనుమానం కలగక మానదు. అప్పటి వరకు స్పీడ్‌ గా సాగిన సినిమా స్లో కావడంతోపాటు బోర్ కొట్టిస్తుంది.