నాగ్‌ బాటలో చైతూ.. ఏకంగా అమీర్‌ ఖాన్‌తో సినిమా

ఇప్పటికే అవకాశం వచ్చినప్పుడల్లా హిందీ సినిమాల్లో నటిస్తున్నారు నాగ్‌. ప్రస్తుతం ఆయన `బ్రహ్మాస్త్ర`లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు నాగచైతన్య కూడా తండ్రి మాదిరిగానే అడుగులు వేయాలనుకుంటున్నాడట. ఓ బాలీవుడ్‌లో సినిమాలో నటించబోతున్నట్టు తెలుస్తుంది. 

naga chatanya will act with amir khan in lal singh chaddha movie  arj

కింగ్‌ నాగార్జున బాటలోనే ఆయన తనయుడు యువ సామ్రాట్‌ నాగచైతన్య నడుస్తున్నాడు. నాగార్జున తెలుగులో హీరోగా చేస్తున్న క్రమంలోనే హిందీలోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. బాలీవుడ్‌లో ఇతర హీరోల సినిమాలోనే నటించి తన సత్తాని చాటారు. ఇప్పటికే అవకాశం వచ్చినప్పుడల్లా హిందీ సినిమాల్లో నటిస్తున్నారు నాగ్‌. ప్రస్తుతం ఆయన `బ్రహ్మాస్త్ర`లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు నాగచైతన్య కూడా తండ్రి మాదిరిగానే అడుగులు వేయాలనుకుంటున్నాడట. ఓ బాలీవుడ్‌లో సినిమాలో నటించబోతున్నట్టు తెలుస్తుంది. 

అయితే నాగచైతన్య హిందీలో ఓ బిగ్‌ ప్రాజెక్ట్ లో, బిగ్‌ స్టార్‌ హీరో సినిమాలో కీలక పాత్ర పోషించబోతుండటం విశేషం. బాలీవుడ్‌ మిస్టర్‌ పర్‌ఫెక్ట్ అమీర్‌ ఖాన్‌ ప్రస్తుతం `లాల్‌ సింగ్‌ చద్దా` చిత్రంలో నటిస్తున్నారు. కరీనా కపూర్‌ కథానాయికగా నటిస్తుంది. ఇందులో ఓ కీలక పాత్ర కోసం నాగచైతన్యని అడిగినట్టు తెలుస్తుంది. అయితే ముందుగా ఆ పాత్రకి తమిళ నటుడు విజయ్‌ సేతుపతిని సంప్రదించగా, ఆయన డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో చైతూని ఓకే చేసినట్టు తెలుస్తుంది. నాగచైతన్య కూడా దాదాపుగా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారట. 

మేలో ఆయన పాల్గొనే సన్నివేశాలు చిత్రీకరిస్తారని, ఒకే షెడ్యూల్‌లో ఆయన పాత్ర పూర్తి కానుందని టాక్‌. మరి ఇందులో నిజమెంతా అనేది చిత్ర బృందం ప్రకటించాల్సి ఉంది. హాలీవుడ్‌ చిత్రం `ఫారెస్ట్ గంప్‌` కి రీమేక్‌గా `లాల్‌ సింగ్‌ చద్దా` చిత్రం రూపొందుతుండగా, అద్వైత్‌ చందన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. మరోవైపు నాగచైతన్య ప్రస్తుతం `లవ్‌స్టోరి` చిత్రంలో నటిస్తున్నారు. సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తుండగా, శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులోని `సారంగ దరియా` అంటూ సాగే సాయిపల్లవిపై రూపొందించిన పాట ఇప్పటికే విడుదలై యాభై మిలియన్స్ కిపైగా వ్యూస్‌ పొంది దూసుకుపోతుంది. మరోవైపు విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో `థ్యాంక్యూ` చిత్రంలో నటిస్తున్నారు చైతూ.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios