యువ సామ్రాట్‌ నాగచైతన్య వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఆయన నటించిన `లవ్‌ స్టోరి` విడుదలకు సిద్ధంగా ఉంది. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుండగా, ఇందులో సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తుంది. శేఖర్‌ కమ్ముల మార్క్ కూల్‌ లవ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఉండబోతుంది. 

దీంతోపాటు విక్రమ్‌ కె. కుమార్‌ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు చైతూ. దీనికి `థ్యాంక్యూ` అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఇది ఇటీవల ప్రారంభమైన విషయం తెలిసిందే. తాజాగా మరో సినిమాకి చైతూ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారట. సీరియర్‌ హీరో అర్జున్‌ సార్జా దర్శకత్వంలో ఓ సినిమాకి చేయబోతున్నట్టు తెలుస్తుంది. 

అర్జున్‌ యాక్షన్‌ సినిమాలకు కేరాఫ్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ముఖ్యంగా దేశభక్తిగల చిత్రాలకు ఆయన ఫేమస్‌. ప్రస్తుతం ఆయన క్యారెక్టర్‌గా ఆర్టిస్టుగా, విలన్‌గా సినిమాలు చేస్తున్నారు. మరోవైపు ఇప్పటికే దర్శకుడిగానూ తానేంటో నిరూపించుకున్నారు. ఈ క్రమంలో ఇటీవల చైతూకి ఓ కథని నెరేట్‌ చేయగా, ఆయన గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్టు తెలుస్తుంది. అర్జున్‌ తరహాలోనే యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా కథ సాగుతుందని తెలుస్తుంది. మరి ఇది వర్కౌట్‌ అవుతుందా? లేదా? అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్‌ చేయాల్సిందే.