టాలీవుడ్ లో ఒకేసారి ఇద్దరు బ్రదర్స్ ఒకే బ్యానర్ లో చేయడం అనేది రేర్ సీన్. ఇప్పుడు అక్కినేని బ్రదర్స్ ఇద్దరు కూడా మెగా బ్యానర్ లో నటించడానికి సిద్ధమవుతున్నారు. నాగ చైతన్య అఖిల్ ఇద్దరు మెగా కాంపౌండ్ కి నెక్స్ట్ సినిమాల ద్వారా మరింత దగ్గరవుతున్నట్లు తెలుస్తోంది. 

అక్కినేని అఖిల్ - బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్ లో గీతా ఆర్ట్స్ ఒక డిఫరెంట్ సినిమాను నిర్మించడానికి సిద్దమవుతున్నట్లు టాక్ వస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు నాగ చైతన్య కూడా ఒక రొమాంటిక్ లవ్ స్టోరీతో ఇదే బ్యానర్ తో కలవనున్నట్లు సమాచారం. గీత గోవిందం దర్శకుడు పరశురామ్ నెక్స్ట్ చైతు కోసం అదిరిపోయే స్టోరీ సెట్ చేసినట్లు టాక్. 

ఈ మద్య చైతు గీత ఆర్ట్స్ చుట్టూ తీరుగుతూ కనిపిస్తున్నాడు. దీంతో పరశురామ్ తో నెక్స్ట్ చేయబోయే హీరో చైతూనే అని టాక్ వస్తోంది. చైతు ఇదివరకే గీత ఆర్ట్స్ లో 100% లవ్ అనే సినిమాతో మంచి హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మరోసారి అలాంటి హిట్ అందుకోవడానికి సిద్దమవుతున్నాడు. త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన అధికారిక ప్రకటన వెలువడనుంది.