విజయదశమి పురస్కరించుకుని అనేక సినిమాలు ప్రారంభమవుతున్నాయి. కొత్త లుక్‌లను, ఫస్ట్ లుక్‌లను పంచుకుంటూ, టీజర్లు, ట్రైలర్‌, సినిమా అప్‌డేట్లు ప్రకటిస్తూ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. నాగచైతన్య కొత్త సినిమా ప్రారంభమైంది. 

ప్రస్తుతం నాగచైతన్య `లవ్‌ స్టోరి`లో నటిస్తున్నారు. ఇది విడుదలకు సిద్ధంగా ఉంది. మరోవైపు `ఇష్క్`, `మనం`, `24` వంటి ప్రయోగాత్మక చిత్రాలను రూపొందించి దర్శకుడిగా తన ప్రతిభని చాటుకున్న విక్రమ్‌ కె కుమార్‌ దర్శకత్వంలో ఓ సినిమాలో నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా విజయదశమిని పురస్కరించుకుని ఈ సినిమా ప్రారంభమైంది. 

`థ్యాంక్యూ` పేరుతో రూపొందుతున్న ఈ కొత్త రకమైన లవ్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ని ఆదివారం ప్రారంభించారు. ఇందులో ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ పిసి శ్రీరామ్‌, విక్రమ్‌ కుమార్, బివిఎస్‌ రవి, నిర్మాత దిల్‌రాజు, రైటర్‌, డైరెక్టర్‌ బివిఎస్‌రవి పాల్గొన్నారు. ఈ సినిమాని దిల్‌రాజు నిర్మిస్తుండగా, పిసి శ్రీరామ్‌ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.