కాంబినేషన్, ప్రమోషన్ ఈ రెండే మార్కెట్లో సినిమాకు క్రేజ్ తెచ్చి పెట్టేవి, బిజినెస్ చేసి పెట్టేవి. నాగచైతన్య హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మజిలీ’. దేర్ ఈజ్ లవ్... దేర్ ఈజ్ పెయిన్ అనేది ట్యాగ్ లైన్. నాగచైతన్య, సమంత పెళ్లి తర్వాత కలిసి నటిస్తున్న చిత్రమిది. ఇందులో నాగచైతన్య రెండు కోణాల్లో సాగే పాత్రల్లో కనిపించనున్నట్టు తెలుస్తోంది.

ఈ నేపధ్యంలో ఈ చిత్రం బిజినెస్ క్రేజ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో శాటిలైట్ హక్కులను ప్రముఖ జీ టీవీ ఛానెల్ 6 కోట్ల రూపాయలకు దక్కించుకుందని సినీ వర్గాల సమాచారం. ఈ రేటు పెద్ద మొత్తమే. అయితే ఈ రైట్స్ కోసం పెద్ద పెద్ద ఛానెల్స్ అన్ని పోటీ పడినట్లు తెలుస్తోంది. జీ వారు ఎవరూ ఊహించని రేటుతో దక్కించుకున్నారు.
నాగచైతన్య మాట్లాడుతూ... జీవితంలో ఒకొక్క దశ ఒక్కో మజిలీ. ఒక యువ జంట సాగించిన ప్రేమ మజిలీ వెనక సంఘర్షణ ఎలాంటిదో తెలియాలంటే మా చిత్రం చూడాల్సిందే అంటున్నారు.
సమంత, దివ్యాంశ కౌశిక్ హీరోయిన్స్ చేస్తున్న ఈ చిత్రం రీసెంట్ గా విశాఖపట్నం పరిసరాల్లో రెండు పాటల్ని, కొన్ని కీలక సీన్స్ ని తెరకెక్కించారు. ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా పనులు శరవేగంగా సాగుతున్నాయి. సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు.