దర్శకుడు శేఖర్ కమ్ముల 'ఫిదా' సినిమా తరువాత నాగచైతన్యను హీరోగా పెట్టి సినిమా చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు. 'ఫిదా' తరువాత శేఖర్ కమ్ముల ఎలాంటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తాడా..? అనే ఆసక్తి అందరిలో ఉంది. చైతుతో సినిమా అనౌన్స్ చేసి అంచనాలను పెంచేశాడు శేఖర్ కమ్ముల.

ఈ సినిమాలో సాయి పల్లవిని హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నారు. ఈ సినిమా మొత్తం తెలంగాణా బ్యాక్ డ్రాప్ లో సాగే కథ. లీడ్ రోల్స్ తెలంగాణ యాసలోనే మాట్లాడతారట. ఇది ఇలా ఉండగా.. ముందుగా ఈ సినిమాలో హీరోగా ప్రముఖ నటుడు విక్రమ్ కుమార్ తనయుడు ధృవ్ ని తీసుకోవాలని భావించారట.

ఈ మేరకు సంప్రదింపులు కూడా జరిపారు. అయితే ధృవ్ మాత్రం 'అర్జున్ రెడ్డి' రీమేక్ పై ఆసక్తి చూపడంతో శేఖర్ కమ్ముల.. నాగచైతన్యతో సినిమా చేయాలనుకున్నారట. చాలా రోజులుగా శేఖర్ కమ్ములతో కలిసి పని చేయాలని చూస్తోన్న చైతు ఆఫర్ రాగానే యాక్సెప్ట్ చేసినట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో చైతు డాన్స్ టీచర్ గా కనిపించబోతున్నారని టాక్. సునీల్ నారంగ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. సెప్టెంబర్ రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టి వచ్చే ఏడాది ఆరంభంలో సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.