అక్కినేని నాగేశ్వరరావు నటవారసులుగా ఎంట్రీ ఇచ్చిన వారిలో నాగార్జున స్టార్ హీరో అయ్యారు. ఆ తరువాత ఆ కుటుంబం నుండి వచ్చిన హీరోలలో ఒక్క చైతన్య మాత్రమే పరిశ్రమలో నిలదొక్కున్నాడు. చైతన్య ఒక స్థాయి ఇమేజ్ తెచ్చుకోవడంతో పాటు మంచి నటుడిగా గుర్తింపు  పొందారు. మరో హీరో సుశాంత్ చాలా కాలంగా పోరాటం చేస్తూ ఉన్నారు.నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ మూడు సినిమాలు చేసినా హిట్ తగలలేదు.  ఐతే వీరిద్దరి కంటే రెండు దశాబ్దాల క్రితమే హీరో సుమంత్ వెండితెరకు పరిచయం కావడం జరిగింది. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ప్రేమకథ చిత్రంతో సుమంత్ హీరో అయ్యారు. 

ఆ సినిమా వచ్చి 21ఏళ్ళు అవుతున్నా సుమంత్ కెరీర్ కి బ్రేక్ రాలేదు. గ్రాండ్ గా లాంచ్ చేసినా ఆయన నిలదొక్కుకోలేకపోయారు. 2003 మరియు 2004లో సత్యం, గౌరీ అనే రెండు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టాడు. ఆ తరువాత వరుసగా ప్లాప్స్ ఎదురుకావడంతో ఆయనను పూర్తిగా ప్రేక్షకులు మరిచిపోయారు. జయాపజయాలు ఎలా ఉన్నా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. కానీ ఆ కోరుకున్న హిట్ మాత్రం దొరకడం లేదు.

 తాజాగా ఆయన కపటధారి అనే ఓ క్రైమ్ థ్రిల్లర్ చేస్తున్నారు. కన్నడలో విజయం సాధించిన కపటధారి అనే చిత్రానికి ఇది తెలుగు రీమేక్. ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నందిత హీరోయిన్ గా నటిస్తుంది. కాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ అండ్ మోషన్ పోస్టర్ ని హీరో నాగ చైతన్య నేడు సాయంత్రం 5:00 గంటలకు లాంచ్ చేయనున్నారు. అక్కినేని కుటుంబంలోని సీనియర్ హీరో సుమంత్ కోసం జూనియర్ నాగ చైతన్య రావడం విశేషమే.