కన్నడ భామ రష్మిక తెలుగులో స్టార్ హీరోయిన్ ఇమేజ్ కోసం ప్రయత్నాలు చేస్తోంది. వరుస విజయాలను అందుకుంటూ నిర్మాతల దృష్టిలో పడుతోంది. ఇటీవల మహేష్ బాబు సినిమాలో రష్మికని తీసుకోవాలనుకున్నారు.

కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ వచ్చేలా కనిపించడం లేదు. అనీల్ రావిపూడి, దిల్ రాజు కాంబోలో ఈ సినిమా రాబోతుంది. దిల్ రాజు రష్మికని తీసుకోవాలనుకున్నారు ఇప్పుడు అది మిస్ అవుతుండడంతో ఆమెకి మరో అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నాడు.

ఈ ఏడాదిలో దిల్ రాజు నిర్మించబోయే చిత్రాల్లో ఒక సినిమాలో రష్మికని హీరోయిన్ గా తీసుకోబోతున్నారు. నాగచైతన్య హీరోగా ఆ ప్రాజెక్ట్ ఉంటుంది. గతంలో గల్లా జయదేవ్ కొడుకు అశోక్ కోసం రెడీ చేసిన కథ ఇది.

కానీ క్యాన్సిల్ కావడంతో హీరోగా చైతుని రీప్లేస్ చేశారు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ లోకి రష్మిక రాబోతుంది. ప్రస్తుతం ఈ భామ తెలుగు, తమిళ చిత్రాలతో బిజీగా 

గడుపుతోంది. తెలుగులో నితిన్ తో ఓ సినిమా చేయబోతుంది.