ప్రస్తుతం అక్కినేని నాగ చైతన్య వెంకట్ ప్రభు దర్శకత్వంలో 'కస్టడీ' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ పూర్తయింది. మే 12న ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీని గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.
ప్రస్తుతం అక్కినేని నాగ చైతన్య వెంకట్ ప్రభు దర్శకత్వంలో 'కస్టడీ' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ పూర్తయింది. మే 12న ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీని గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. త్వరలో ఈ చిత్ర ప్రచార కార్యక్రమాలు కూడా షురూ కానున్నాయి.
ఈ గ్యాప్ లో నాగ చైతన్య కొత్త కథలు వింటున్నట్లు తెలుస్తోంది. ఇక నుంచి చైతు యాక్షన్ ,మాస్, థ్రిల్లర్ చిత్రాలు మాత్రమే చేయాలని డిసైడ్ అయ్యాడట. ఆల్రెడీ లవర్ బాయ్ గా ఇమేజ్ వచ్చింది. కాబట్టి ఇక ఆ జోనర్ కి వెళ్ళకూడదు అని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్ పరుశురామ్ నేరేట్ చేసిన కథని రిజెక్ట్ చేయడానికి కూడా కారణం ఇదే అని చెబుతున్నారు.

ప్రస్తుతం నాగ చైతన్యకి ముగ్గురు దర్శకులు చెప్పిన కథలతో ఇంప్రెస్ అయ్యాడట. ఆ ముగ్గురితో చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. చైతు తన కొత్త ప్రాజెక్ట్స్ ని త్వరలోనే లాక్ చేయబోతున్నట్లు సమాచారం. కస్టడీ అవుట్ పుట్ పై కూడా చైతు హ్యాపీగా ఉన్నట్లు తెలుస్తోంది.
కస్టడీ చిత్రంలో అరవింద్ స్వామి, ప్రియమణి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చైతూకి జోడిగా కృతి శెట్టి నటిస్తోంది. నాగ చైతన్య చివరగా నటించిన థాంక్యూ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా నిరాశపరిచింది. అంతకు ముందు లాల్ సింగ్ చద్దాలో కీలక పాత్రలో నటించగా అది కూడా బెడిసి కొట్టింది. సో నాగ చైతన్యకి కస్టడీ విజయం చాలా కీలకం కానుంది.
