Asianet News TeluguAsianet News Telugu

#NagaChaitanya: కానిస్టేబుల్ గా చైతు, క్యారక్టర్ మామూలుగా ఉండదు

 సాహసం శ్వాసగా సాగిపో చిత్రంలో నాగచైతన్య డిసీపి ర్యాంక్ అథికారిగా కనిపించారు. ఇప్పుడు డిపార్టమెంట్ లో లో ర్యాంక్ అయిన కానిస్టేబుల్ గా కనిపించి అలరించనున్నారు. 

Naga Chaitanya to be seen as a constable
Author
First Published Nov 22, 2022, 9:23 AM IST


హిట్,ఫ్లాప్ లకు సంభందం లేకుండా ముందుకు వెళ్తున్నారు అక్కినేని వారసుడు, నాగ చైతన్య. రీసెంట్ రిలీజ్ లు 'థాంక్యూ', బాలీవుడ్‌ ఫస్ట్‌ మూవీ 'లాల్‌ సింగ్‌ చద్దా' రెండు భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ అయ్యాయి. అయినా తగ్గేదేలే అన్నట్లు వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నాడు.  అలాగే రీసెంట్‌గా డిజిటల్‌ ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య దూత అనే వెబ్‌ సిరీస్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వెబ్‌ సిరీస్‌కు 'థాంక్యూ' డైరెక్టర్‌ విక్రమ్ కె కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇవే కాకుండా తమిళ స్టార్‌ డైరెక్టర్‌  వెంకట్‌ ప్రభు తో చైతూ సినిమా చేస్తున్నారు తెలుస్తోంది.  వెంకట్‌ ప్రభు  ఇటీవల 'మానాడు' సినిమాతో హిట్‌ కొట్టడంతో ఈ సినిమాపై మంచి క్రేజ్ ఉంది. ఈ సినిమా గురించిన ఓ ఇంట్రస్టింగ్ అప్డేట్ బయిటకువచ్చింది. 

అదేమిటంటే ఈ సినిమాలో నాగచైతన్య కానిస్టేబుల్ పాత్రలో కనిపించబోతున్నారు. గతంలో నాగచైతన్య పోలీస్ పాత్రలు చేసారు. సాహసం శ్వాసగా సాగిపో చిత్రంలో నాగచైతన్య డిసీపి ర్యాంక్ అథికారిగా కనిపించారు. ఇప్పుడు డిపార్టమెంట్ లో లో ర్యాంక్ అయిన కానిస్టేబుల్ గా కనిపించి అలరించనున్నారు. ఈ సినిమా చైతు క్యారక్టరైజేషన్ చుట్టూ తిరుగుతుందని, ఓ డిఫరెంట్  కాన్సెప్టు అని,పూర్తి స్దాయి యాక్షన్ థ్రిల్లర్ అని తెలుస్తోంది. త్వరలోనే ఫస్ట్ లుక్ వదలనున్నారు.

సరోజ, గోవా, పార్టీ, గ్యాంబ్లర్, బిర్యానీ,  మానాడు వంటి సస్పెన్స్ థ్రిల్లర్‌ యాక్షన్ మూవీస్‌తో ఎంటర్‌టైన్‌ చేశారు వెంకట్‌ ప్రభు.ఈ సినిమా కూడా అలాంటిదే అంటున్నారు.   ఈ సినిమాతో వెంకట్‌ ప్రభు తెలుగులో మొదటి డెబ్యూగా ఎంట్రీ ఇస్తున్నారు. మరో ప్రక్క  నాగ చైతన్య ఓ వెబ్ సిరీస్ కూడా చేస్తున్న‌ాడు. ఈ వెబ్ సిరీస్​ను ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ సంస్థ నిర్మిస్తోంది. భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న ఈ వెబ్‌ సిరీస్‌ ద్వారా నాగ చైతన్య ఓటీటీ ప్రపంచంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇక, క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ సిరీస్‌లో చై జర్నలిస్ట్​గా, నెగెటివ్​ పాత్రలో చేస్తున్నట్లు సమాచారం. అందులో చైతన్య మేకోవర్​ కూడా విభిన్నంగా ఉంటుందని టాక్​. మొత్తం మూడు సీజన్​లుగా ఈ వెబ్ సిరీస్​ను ప్రసారం చేయనున్నట్లు తెలుస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios