Asianet News TeluguAsianet News Telugu

అమీర్ ఖాన్ నుంచి చాలా నేర్చుకున్నా, ఆయనకు కృతజ్ఞతలు తెలిపిన నాగచైతన్య

అమీర్ ఖాన్ నుంచి చాలా నేర్చుకోవాలి. చాలా నేర్చుకున్నాను కూడా. నిజంగా ఆయనకు చాలా కృతజ్ఞతలు అంటూ.. అమీర్ పై తన అభిప్రాయాలు వెల్లడించాడు నాగచైతన్య. బాలీవుడ్ స్టార్ హీరోను ఆకాశానికి ఎత్తాడు. 
 

Naga Chaitanya Thanks to Aamir Khan
Author
Hyderabad, First Published Aug 8, 2022, 6:03 PM IST

అమీర్‌ఖాన్‌ హీరోగా, కరీనా కపూర్ హీరోయిన్ గా తెరకెక్కిన సినిమా లాల్ సింగ్ చడ్డా. అమీర్ ఓన్ ప్రొడక్షన్ లో నిర్మించిన ఈసినిమాలో  టాలీవుడ్ యంగ్ హీరో, యువ సాంమ్రాట్ అక్కినేని నాగచైతన్య ప్రత్యేక పాత్రలో నటిస్తూ..  బాలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. హాలీవుడ్ మూవీకి  రీమేక్ గా తెరకెక్కిన ఈసినిమాకు  అద్వైత్‌ చందన్‌ దర్శకత్వం వహించారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల11న రిలీజ్ కు రెడీ అవుతోంది లాల్ సింగ్ చడ్డా. ఈ సినిమాను  తమిళనాడులో ఉదయనిధి స్టాలిన్‌కు చెందిన రెడ్‌ జెయింట్‌ మూవీస్‌ సంస్థ విడుదల చేస్తోంది.

ఈ సందర్భంగా మూవీ తమిళ వెర్షన్ ట్రైలర్‌ లాంట్ ఈవెంట్ ను చెన్నైలోని సత్యం థియేటర్‌లో నిర్వహించారు.ఈ వెంట్ లో నాగచైతన్య మాట్లాడుతూ.. తాను చెన్నై కుర్రాడినేనని, 18 ఏళ్లు ఇక్కడే పెరిగానని అన్నారు. మూవీ లాంగ్ గ్యాప్ తరువాత లాల్ సింగ్ చడ్డా మూవీ  ప్రమోషన్‌లో భాగంగా  చెన్నైకి రావడం సంతోషకరం అన్నారు. లాల్‌ సింగ్‌ చడ్డా సినిమా  నటించే అవకాశం కల్పించిన అమీర్‌ ఖాన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన నుంచి చాలా నేర్చుకున్నానని అన్నారు.  ఆయనో డిక్షనరీ లాంటివారు. అంత గొప్ప నటుడితో కో స్టార్ గా చేసినందుకు ఆనందంగా ఉందన్నారు. 

 ఈ సందర్భంగా ఉదయనిధి స్టాలిన్‌ మాట్లాడుతూ అమీర్‌ ఖాన్‌ తన అభిమాన నటుడన్నారు. లాల్‌ సింగ్‌ చద్దా  సినిమాను తమిళనాడులో విడుదల చేయా ల్సిందిగా ఆయనే స్వయంగా వీడియో కాల్‌ చేసి కోరారని, మరో మాట లేకుండా అందుకు అంగీకరింనట్లు చెప్పారు. తాను సినిమా చూశాననీ అద్భుతంగా ఉందన్నారు. తమిళ నేటివిటీకి తగ్గట్టుగా చిన్న చిన్న సచనలు చేయగా వాటిని అమలు పరచారన్నారు.

చిత్రాన్ని సాధ్యమైనంత వరకు అత్యధిక థియేటర్లల్లో విడుదల చేస్తామని అమీర్‌ ఖాన్‌కు మాట ఇస్తున్నాని అన్నారు. అమీర్‌ ఖాన్‌ మాట్లాడుతూ.. రచయిత కులకర్ణి సుమారు 14 ఏళ్లుగా ఈ సినిమా  కథపై కసరత్తు చేశారన్నారు. తానూ ఏడాదిన్నర పాటు ఈ కథతో ట్రావెల్‌ చేసినట్లు చెప్పారు. కథ నచ్చడంతో సినిమా చేశామన్నారు. ఉదయనిధి స్టాలిన్‌ రెడ్‌ జెయింట్‌ మూవీస్‌ సంస్థ తమ సినిమాను తమిళనాట విడుదల చేయడం సంతోషంగా ఉందన్నారు అమీర్ ఖాన్. 
 

Follow Us:
Download App:
  • android
  • ios