Asianet News TeluguAsianet News Telugu

నాగ చైతన్య 'తండేల్' రిలీజ్ డేట్ ,భలే టైమ్ పట్టారే

 చైతూతో మొదట అనుకున్న 70 కోట్ల బడ్జెట్ తో ప్యాన్ ఇండియా సినిమా మొదలెట్టారు. ఇది ఇండస్ట్రీని ఆశ్చర్యపరుస్తోంది. 

Naga Chaitanya Thandel to hit theaters for Christmas 2024? jsp
Author
First Published Apr 17, 2024, 5:38 PM IST


సౌతిండియా లో టాప్ ప్రొడక్షన్ హౌస్ లలో ఒకటైన   గీతా ఆర్ట్స్‌  ప్రతీ విషయంలోనూ ఆచి,తూచి అడుగులు వేస్తుంది. ముఖ్యంగా రిలీజ్ డేట్ ఫిక్స్ చేయటంలో అల్లు అరవింద్‌ ని మించిన వారు లేరు. ఈ సంస్థ ఐదు దశాబ్ధాలుగా సక్సెస్‌ ఫుల్‌ ప్రొడక్షన్ హౌస్‌గా కొనసాగుతోంది అంటే కారణం అరవింద్ ప్లానింగ్,ధైర్యం అనే చెప్పాలి. కేవలం ప్రొడక్షన్ లో మాత్రమే కాకుండా డిస్ట్రిబ్యూషన్‌ రంగంలోనూ సక్సెస్ ని చూస్తున్న ఈ సంస్ద ఎప్పటికప్పుడు కొత్త సినిమాలతో ముందుకు వస్తూంటుంది. ట్రెండ్ క్రియేట్ చేస్తుంది. సౌత్ లోనే కాకుండా ఉత్తరాదిన కూడా పలు సినిమాలు నిర్మించి సక్సెస్‌ అయింది. 

తెలుగు పరిశ్రమలో సక్సెస్‌ రేటు అత్యధికంగా ఉన్న నిర్మాణ సంస్థలలో ఇది కూడా ఒకటి. ఈ బ్యానర్‌ నుండి సినిమా వస్తుందంటే మినిమం గ్యారెంటీ అనే భావన ప్రేక్షకులలో ఉంది. ఇక ఇప్పుడు #Thandel సినిమా చేస్తోంది. నాగచైతన్య హీరోగా భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ చిత్రానికి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. 2024 కిస్మస్ కు ఈ చిత్రం రిలీజ్ కాబోతోందని ట్రేడ్ వర్గాల సమాచారం. 'తండేల్' చిత్రాన్ని డిసెంబరు 20న థియేటర్లలోకి తీసుకు రావాలని నాగ చైతన్య, దర్శక నిర్మాతలు చందూ మొండేటి, బన్నీ వాసు భావిస్తునట్లు తెలుస్తోంది. అతి త్వరలో విడుదల తేదీని అధికారికంగా ప్రకటించనున్నారు.

నాగచైతన్య వరస సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. దిల్ రాజు బ్యానర్ లో వచ్చిన ధాంక్యూ  ఓపినింగ్స్ కూడా తెచ్చుకోలేకపోయింది. మరో ప్రక్క ఓటిటి, హిందీ డబ్బింగ్ రైట్స్ కు పెద్దగా రావటంలేదు. అయినా సరే మార్కెట్ లేదనో, రైట్స్ రావటం లేదనో వెనక్కి తగ్గకుండా చైతూతో మొదట అనుకున్న 70 కోట్ల బడ్జెట్ తో ప్యాన్ ఇండియా సినిమా మొదలెట్టారు. ఇది ఇండస్ట్రీని ఆశ్చర్యపరుస్తోంది. అరవింద్ ధైర్యానికి అందరూ విస్తుపోతున్నారు.
 
 ఈ చిత్రంలో హీరో నాగచైతన్య  తండేలుగా కనిపిస్తాడు. బోట్స్ నడిపే వారిని 'తండేలు' అని అంటారు. అది చాలా పాత పదం. గుజరాత్‌ లోని సూరత్ లో ఒక వ్యక్తి నిజ జీవితంలో జరిగిన ఘటనల ఆధారంగా ఈ సినిమా కథ ఉంటుంది. ఇది ఒక అందమైన ప్రేమకథ.. ఊహించని ట్విస్టులు టర్న్స్ ఉంటాయి. అలాంటి బోట్ డ్రైవర్ క్యారక్టర్ లో చైతన్య నటించనున్నారు. సినిమా అంతా ఫిషర్ మ్యాన్స్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది. దీని కోసం చాలా రీసెర్చ్ చేశారు. చైతూతో చందు గతంలో 'ప్రేమమ్' 'సవ్యసాచి' వంటి సినిమాలను రూపొందించారు. ఇప్పుడు వీరిద్దరో కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ అంటే కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని  భావిస్తున్నారు. 

'బంగార్రాజు' వంటి సూపర్ హిట్ తర్వాత నాగచైతన్య 'థాంక్యూ'  సినిమా డిజాస్టర్  అయ్యింది. ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్న కస్టడీ' మూవీ కూడా నిరాశ పరిచింది. దీంతో అక్కినేని వారసుడు తదుపరి చిత్రంతో కచ్చితంగా బ్లాక్ బస్టర్ కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.  గతంలో ఇదే బ్యానర్ లో చేసిన '100% లవ్' మూవీ చైతూ కెరీర్ ని మళ్లీ లైన్ లో పెట్టింది. అందుకే ఈసారి అదే సెంటిమెంట్ తో మంచి హిట్ వస్తుందని ఆశిస్తున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios