ఫాన్స్ సౌండ్‌కి రీసౌండ్‌ కన్ఫర్మ్: నాగచైతన్య

naga chaitanya speech at officer movie pre release event
Highlights

అక్కినేని అభిమానులకు గతేడాది 'రారండోయ్ వేడుక చూద్దాం'తో హిట్ ఇచ్చాడు 

అక్కినేని అభిమానులకు గతేడాది 'రారండోయ్ వేడుక చూద్దాం'తో హిట్ ఇచ్చాడు యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య. దాంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ. నెక్స్ట్ 'యుద్ధం శరణం'తో డిజాస్టర్ అందించి నిరాశ మిగిల్చాడు. నాగార్జునదీ సేమ్ సిట్యువేషన్. 'ఓం నమో వేంకటేశాయ'తో ప్రేక్షకులు ఆశించిన అంచనాలు చేరుకొని కింగ్, 'రాజుగారి గది-2'తో ఖుషీ చేశారు. అఖిల్ అయితే 'హలో'తో మిక్స్డ్ ఫీలింగ్స్ మిగిల్చాడు. ఈ ఏడాది ఇంకా అక్కినేని సినిమాలు విడుదల కాలేదు. 'మహానటి'లో నాగచైతన్య కనిపించినా... అతిథి పాత్ర కాబట్టి లెక్కలోకి తీసుకోవడం కష్టమే. 'ఆఫీసర్'తో కింగ్ నాగార్జున ఈ ఏడాది బాక్సాఫీస్ దగ్గర ఖాతా తెరవబోతున్నాడు.


ఈ సినిమా బాగుటుందని నాగచైతన్య అభిమానులకు భరోసా ఇచ్చాడు. అక్కినేని కుటుంబం నుంచి ఈ ఏడాది వచ్చే ప్రతి సినిమా బాగుంటుందనే అభిప్రాయాన్ని అభిమానుల్లో కలిగించాడు. 'ఆఫీసర్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నాగచైతన్య మాటలు అభిమానులకు బూస్ట్ ఇచ్చాయి. "తప్పకుండా అభిమానులందరికీ ఈ ఏడాది చాలా బావుంటుంది. (ఆడిటోరియంలో హంగామా చేస్తున్న అభిమానులను ఉద్దేశిస్తూ...) మీరు ఇచ్చిన ప్రతి సౌండ్‌కి తప్పకుండా ఒక రీసౌండ్‌ ఉంటుంది" అని నాగచైతన్య కిక్ ఇచ్చాడు. అయితే... ఈవెంట్ ముగిసే వరకూ చైతూ సందడి చేయలేదు. మాట్లాడిన వెంటనే ఇంటికి వెళ్ళిపోయాడు. 

loader