షాకింగ్: సమంత సినిమాపై చైతు నెగెటివ్ ప్రచారం

First Published 11, Sep 2018, 12:33 PM IST
naga chaitanya shocking comments on samantha's uturn movie
Highlights

సమంత సినిమా చూడొద్దంటూ నాగచైతన్య చేసిన కామెంట్స్ ఇప్పుడు అభిమానుల మధ్య హాట్ టాపిక్ గా మారాయి. నాగచైతన్య నటించిన 'శైలజా రెడ్డి అల్లుడు', సమంత నటించిన 'యూటర్న్' సినిమాలు ఒకేరోజు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి

సమంత సినిమా చూడొద్దంటూ నాగచైతన్య చేసిన కామెంట్స్ ఇప్పుడు అభిమానుల మధ్య హాట్ టాపిక్ గా మారాయి. నాగచైతన్య నటించిన 'శైలజా రెడ్డి అల్లుడు', సమంత నటించిన 'యూటర్న్' సినిమాలు ఒకేరోజు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

వినాయకచవితి సందర్భంగా ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడనున్నాయి. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నాగచైతన్య చేసిన కామెంట్స్ ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి . ''దయచేసి అంతా నా సినిమానే చూడండి. ఎందుకంటే ఈ ఏడాది నాకిది మొదటి రిలీజ్. ఈ ఏడాది సమంత నటించిన 'మహానటి','రంగస్థలం' సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. కాబట్టి ముందు నా సినిమానే చూడండి'' అంటూ వెల్లడించాడు.

అంటే సమంతకి ఇప్పటికే సూపర్ హిట్స్ ఉన్నాయి కాబట్టి తన సినిమా చూడమని ఆడియన్స్ ని కోరుతున్నాడు చైతు. మళ్లీ సమంత బాధ పడుతుందనేమో ఈ రెండు సినిమాలకు పోలిక పెడుతూ చివరి 40 నిమిషాల్లో రెండు సినిమాల్లో కీలకమని తన సినిమా చూసిన వారు ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారని అన్నారు. 

loader