ప‌ర‌శురామ్ సిద్ధం చేసిన క‌థ నాగ‌చైత‌న్య‌కు న‌చ్చ‌లేద‌ని చెప్పుకున్నారు. స్క్రిప్ట్ విష‌యంలో పూర్తిస్థాయిలో సంతృప్తి క‌ల‌గ‌పోవ‌డంతో నాగ‌చైత‌న్య ఈ సినిమా నుంచి త‌ప్పుకున్న‌ట్లు చెబుతున్నారు.


 విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టించిన గీతా గోవిందం సినిమాతో స్టార్ డైరక్టర్స్ లిస్ట్ లో చేరిపోయాడు ప‌ర‌శురామ్‌. గీతా గోవిందం స‌క్సెస్ త‌ర్వాత నాగ‌చైత‌న్య‌తో ఓ సినిమా క‌మిట్ అయ్యాడు. కానీ మ‌హేష్‌బాబు స‌ర్కారువారి పాట సినిమా ముందుకు రావ‌డంతో నాగ‌చైత‌న్య సినిమాను హోల్డ్‌లో పెట్టాడు ప‌ర‌శురామ్‌. స‌ర్కారువారి పాట స‌క్సెస్‌ త‌ర్వాత నాగ‌చైత‌న్య సినిమాను ప‌ట్టాలెక్కించేందుకు చాలా కాలంగా ప్ర‌య‌త్నించాడు ప‌ర‌శురామ్‌. ఈ సినిమాకు నాగేశ్వ‌ర‌రావు అనే వ‌ర్కింగ్ టైటిల్‌ను నిర్ణ‌యించిన‌ట్లు వార్త‌లొచ్చాయి. కానీ స‌ర్కారువారి పాట విడుద‌లై ఇంతకాలం గ‌డుస్తోన్నా నాగ‌చైత‌న్య‌, ప‌ర‌శురామ్ సినిమా షూటింగ్ మాత్రం మొద‌లుకాలేదు.

 ఈ సినిమా ఆగిపోయిన‌ట్లు టాలీవుడ్‌లో ప్ర‌చారం జ‌రిగింది. ప‌ర‌శురామ్ సిద్ధం చేసిన క‌థ నాగ‌చైత‌న్య‌కు న‌చ్చ‌లేద‌ని చెప్పుకున్నారు. స్క్రిప్ట్ విష‌యంలో పూర్తిస్థాయిలో సంతృప్తి క‌ల‌గ‌పోవ‌డంతో నాగ‌చైత‌న్య ఈ సినిమా నుంచి త‌ప్పుకున్న‌ట్లు చెబుతున్నారు. స‌మిష్టి నిర్ణ‌యంతోనే నాగ‌చైత‌న్య‌, ప‌ర‌శురామ్ ఈ సినిమాను ప‌క్క‌న‌పెట్టిన‌ట్లు వినపడింది. ఈ విషయమై నాగచైతన్య తాజాగా కష్టడీ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా ఇస్తున్న ఇంటర్వూలో మాట్లాడారు. 

నాగచైతన్య చెప్తూ... #Parasuram గురించి మాట్లాడటం టైమ్ వేస్ట్. , అతను నా టైమ్ వేస్ట్ చేసాడు. ఈ టాపిక్ మాట్లాడటం కూడా నాకు ఇష్టం లేదు అని #NagaChaitanya తేల్చి చెప్పేసారు.

అలాగే "నేను కానీ అఖిల్ కానీ ఇప్పటికిప్పుడు నాన్న ఈ డైరెక్టర్ తో నాకు చెయ్యాలనుంది అని చెప్తే కార్ ఎక్కి ఆ డైరెక్టర్ ఆఫీస్ కి వెళ్లి ప్రాజెక్ట్ సెట్ చేస్తాడు, మీకు ఏ డైరక్టర్ కావాలో అడగండ్రా అడ్వాన్స్ పంపిస్తాను అని చాలా సార్లు అడిగారు. ఇందులో నాన్న తప్పు ఎం లేదు మేము వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా ఇండిడ్యువల్ గా ఎదగాలి అనుకుంటున్నాము" అని చెప్పారు నాగచైతన్య. 

నాగ‌చైత‌న్య ఈ సినిమా వద్దునుకోవటంతో విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో ద‌ర్శ‌కుడు ప‌ర‌శురామ్ సంప్ర‌దింపులు జ‌రుపుతోన్న‌ట్లు తెలిసింది. గీత‌గోవిందం స‌క్సెస్‌ దృష్ట్యా ప‌ర‌శురామ్‌తో విజ‌య్ సినిమా చేసే అవ‌కాశాలు ఉన్న‌ట్లు టాలీవుడ్‌లో ప్ర‌చారం జ‌రుగుతోంది. ప్ర‌స్తుతం నాగ‌చైత‌న్య క‌స్ట‌డీ రిలీజ్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. వెంక‌ట్ ప్ర‌భు ద‌ర్శ‌క‌త్వంలో తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఈ సినిమా రూపొందుతోంది. అలాగే విక్ర‌మ్ కె కుమార్‌తో దూత అనే వెబ్‌సిరీస్ చేస్తున్నాడు.