దిల్ రాజు నిర్మాతగా సినిమా చేయటానికి ప్రతీ హీరో ఉత్సాహం చూపెడతారు. అయితే నాగచైతన్య మాత్రం రీసెంట్ గా మొహమాటం లేకుండా నో చెప్పారట.  వరస పెయిల్యూర్స్ తర్వాత వచ్చిన  అక్కినేని నాగచైతన్య మజిలీ సినిమాతో సంచలన విజయం సాధించడంతో కెరీర్ లో జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం వెంకటేష్ తో వెంకీ మామ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా దసరాకి ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ సినిమా తర్వాత తండ్రి నాగార్జునతో బంగార్రాజు చేయనున్నాడు.   

ఈ గ్యాప్ లో నాగచైతన్యతో దిల్ రాజు ఓ సినిమా చేయాలనీ అనుకున్నారు.నూతన దర్శకుడు శశితో ఈ సినిమా ఉంటుందని ఆల్రెడీ ప్రకటించారు. వచ్చే నెల నుంచి షూటింగ్ స్టార్ట్ చేయాలని అనుకున్నారు. అందుకు చైతూ స్టోరీ లైన్ విని ఓకే అని , ఇప్పుడు పూర్తి స్క్రిప్టు రెడీ అయ్యాక పెద్ద నో చెప్పాశారని సమాచారం. అయితే దిల్ రాజు క్యాంప్ లో మాత్రం  ఆ కథ చాలా బాగా వచ్చిందని , కావాలనే చైతు కాదనుకున్నాడని అంటున్నారు.

ఈ నేపధ్యంలో అసలు చైతు కాదనటానికి కారణాలు అన్వేషణ ఫిల్మ్ సర్కిల్స్ లో మొదలైంది. వాళ్లు చెప్తున్న దాని ప్రకారం ..చైతూకు దిల్ రాజు అంటే కోపం ఉందిట. చైతుని హీరోగా పరిచయం చేసింది రాజే. వాసు వర్మ దర్శకత్వంలో 2009లో వచ్చిన ఆ సినిమా ‘జోష్’.  ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది.  పదేళ్ల తర్వాత తిరిగి కలిసి పని చెయ్యాలని  దిల్ రాజు వెళ్లి కలిసాడు.

ఈ సినిమా ద్వారా శశి అనే దర్శకుడు పరిచయం చేద్దామనుకున్నాడు. అయితే అప్పటి ప్లాఫ్ ని దృష్టిలో పెట్టుకున్న చైతు... ఆల్రెడీ ప్రూవ్ అయిన దర్శకుడుని కాకుండా కొత్తవాడిని పంపటం నచ్చలేదట. దానికి తోడు...కథలో సెకండాఫ్ కూడా నచ్చలేదు. అయితే కథని మార్చమని అడగొచ్చు. కానీ ఏకంగా సినిమానే వద్దని అనేసారట.