ఇటీవల జరిగిన హీరో రానా-మిహీకా పెళ్ళి వేడుకలో అక్కినేని నాగచైతన్య, ఆయన సతీమణి, నటి సమంత కూడా పాల్గొన్నారు. గ్రాండియర్‌ లుక్‌లో జరిగిన ఈ మ్యారేజ్‌
ఈవెంట్‌లో రానా, మిహీకాల కంటే చైతూ-సమంతనే బాగా హైలైట్‌ అయ్యారు. ఇద్దరు మ్యారేజ్‌లో అటూ ఇటూ తిరుగుతూ అందరికి చూపులను ఆకర్షించారు. పెళ్ళి
రానా-మిహీకాలది అయితే, సందడంతా చైతూ, సామ్‌లదే అనేంతగా సందడి చేశారు.  

అయితే ఈ వేడుకలో సమంతపై చైతూ చేసిన ఓ చిలిపి పని ఇప్పుడు రచ్చ రచ్చ చేస్తుంది. సోషల్‌ మీడియాలో హంగామా చేస్తుంది. మరి ఇంతకి చైనా ఏం చేశాడనేగా మీ
ప్రశ్న. అతిథులంతా రానా పెళ్ళిని తిలకిస్తున్నారు. మూడుమూళ్ళు వేసేందుకు రానా రెడీ అవుతున్నారు. అంతకు ముందే నూతన దంపతులను ఆశీర్వధించేందుకు
అతిథులకు అక్షింతలు పంచిపెట్టారు. ఇక కొత్త జంటపై చల్లేందుకు సిద్ధమవుతున్న సమయంలో చైతూకి ఓ చిలిపి ఆలోచన వచ్చింది. 

పెళ్ళిలో ఎవరితోనో మాట్లాడుతున్న సమంతపై తెలియకుండా వెనకాల నుంచి ఆమెపై అక్షింతలు వేయడం మొదలెట్టాడు చైతూ. దీన్ని ఎవరో క్యాప్చర్‌ చేశారు. సామాజిక
మాధ్యమాల్లో పంచుకున్నారు. దీంతో ఇప్పుడిది సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. చైతూ చేసిన ఈ చిలిపి పనికి నెటిజన్లు సరదాగా కామెంట్‌ చేస్తున్నారు. మొత్తంగా
చైతూ, సామ్‌ ఎట్రాక్టింగ్‌ కపుల్‌ అనిపించుకున్నారు. మరోవైపు మిహీకాని తమ ఫ్యామిలీలోకి ఆహ్మానిస్తూ సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టిన విషయం తెలిసిందే.

ఇక ఇటీవల `జాను`లో మెరిసిన సమంత ప్రస్తుతం ఓ తమిళ చిత్రంలో నటిస్తుంది. అలాగే నాగచైతన్య శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో `లవ్‌స్టోరి`లో నటిస్తున్నారు. దీంతోపాటు
మరో సినిమాకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. సాయి పల్లవి హీరోయిన్‌గా రూపొందిన `లవ్‌ స్టోరి` విడుదలకు సిద్ధంగా ఉంది.