Asianet News TeluguAsianet News Telugu

`యుద్ధం శ‌ర‌ణం` టీజ‌ర్ విడుద‌ల‌ తేదీ చెప్పేశారు

  • నాగ‌చైత‌న్య హీరోగా వారాహి చ‌ల‌న చిత్రం బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న చిత్రం `యుద్ధం శ‌ర‌ణం`
  • కృష్ణ ఆర్‌.వి.మారి ముత్తు ద‌ర్శ‌క‌త్వం, ర‌జ‌ని కొర్ర‌పాటి నిర్మాత‌, లావణ్య త్రిపాటి హీరోయిన్
  • నెగ‌టివ్ షేడ్స్ ఉన్న పాత్ర‌లో హీరో శ్రీకాంత్ నటిస్తున్న ఈ చిత్రం టీజర్ ఈ 31న విడుదల
naga chaitanya next movie yuddham sharanam teaser release date out

యువ‌సామ్రాట్ నాగ‌చైత‌న్య హీరోగా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ వారాహి చ‌ల‌న చిత్రం బ్యాన‌ర్‌పై కృష్ణ ఆర్‌.వి.మారి ముత్తు ద‌ర్శ‌క‌త్వంలో ర‌జ‌ని కొర్ర‌పాటి నిర్మాత‌గా రూపొందుతోన్న చిత్రం `యుద్ధం శ‌ర‌ణం`. సీనియ‌ర్ హీరో శ్రీకాంత్ ఈ చిత్రంలో నెగ‌టివ్ షేడ్స్ ఉన్న పాత్ర‌లో న‌టిస్తున్నారు. లావ‌ణ్య త్రిపాఠి హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ సినిమా టీజ‌ర్‌ణు జూలై 31సినిమా టీజ‌ర్ విడుద‌ల కానుంది.

 

 ఈ సంద‌ర్భంగా...

వారాహి చ‌ల‌న చిత్రం అధినేత సాయి కొర్రపాటి మాట్లాడుతూ.. ``విల‌క్ష‌ణ‌మైన హీరోయిజంతో ఉన్న సినిమాల‌ను చేయ‌డంలో ఆస‌క్తి చూపే అక్కినేని నాగ‌చైత‌న్య న‌టించిన పుల్‌ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "యుద్ధం శరణం`. ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌ను రీసెంట్‌గా విడుద‌ల చేశారు. ఫ‌స్ట్‌లుక్‌లో నాగ‌చైత‌న్య‌, శ్రీకాంత్ లుక్స్ చాలా సూప‌ర్బ్ అంటూ ప్రేక్ష‌కుల నుండి స్పంద‌న వ‌చ్చింది. సినిమా ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తి ఏర్ప‌డింది. క‌థ‌కు త‌గ్గ టైటిల్‌లో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రంలో  శ్రీకాంత్, రావు రమేష్‌లు కీలకపాత్రల్లోఒ న‌టిస్తున్నారు. అలాగే.. మురళీశర్మ-రేవతీల పాత్రలు చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. ఈ సినిమా టీజ‌ర్‌ను జూలై 31 సాయంత్రం 5.45 గంట‌ల‌కు విడుద‌ల చేస్తాం. ఫ్యామిలీ అండ్ యాక్ష‌న్ ఎలిమెంట్స్‌తో అక్కినేని అభిమానులను, ప్రేక్ష‌కుల‌ను మెప్పించేలా సినిమా ఉంటుది. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి సినిమాను వీలైనంత త్వర‌గా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తాం`` అన్నారు. 

 

ఈ చిత్రానికి సమర్పణ: సాయి శివాణి, లైన్ ప్రొడ్యూసర్: కార్తికేయ, కథ: డేవిడ్ ఆర్.నాథన్, మాటలు: అబ్బూరి రవి, స్క్రీన్ ప్లే: డేవిడ్ ఆర్.నాథన్ - అబ్బూరి రవి, కళ: రామకృష్ణ, సినిమాటోగ్రఫీ: నికేత్ బొమ్మి, సంగీతం: వివేక్ సాగర్, నిర్మాణం: వారాహి చాలనచిత్రం, నిర్మాత: రజని కొర్రపాటి, దర్శకత్వం: కృష్ణ ఆర్.వి.మారిముత్తు.

Follow Us:
Download App:
  • android
  • ios