MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • TV
  • Bigg Boss Telugu 10: షాలిని ఔట్.. పక్కాగా ప్లాన్ చేసి పంపించిన బిగ్ బాస్, రోహిత్ బుర్రవాడాలన్న దక్షి..

Bigg Boss Telugu 10: షాలిని ఔట్.. పక్కాగా ప్లాన్ చేసి పంపించిన బిగ్ బాస్, రోహిత్ బుర్రవాడాలన్న దక్షి..

Bigg Boss Telugu 10: బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 రసవత్తరంగా సాగుతోంది. ఏడో వారానికి చేరుకున్న షోలో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ట్విస్ట్ ఇచ్చాడు కింగ్ నాగార్జున.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Oct 25 2026, 11:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
షాలినీకి షాక్ ఇచ్చిన కంటెస్టెంట్స్
Image Credit : Star Maa

షాలినీకి షాక్ ఇచ్చిన కంటెస్టెంట్స్

డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని హోస్ట్ నాగార్జున ముందుగానే హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆడియెన్స్ ఓటింగ్ ఆధారంగా హౌస్ నుంచి దక్షి ఎలిమినేట్ అయినట్లు అధికారికంగా వెల్లడైంది. అయితే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ లో భాగంగా రెడ్ జోన్ లో ఉన్న వారి నుంచి ఒకరిని బయటకు పంపించే ప్రయత్నంలో భాగంగా హౌస్ నుంచి ఓటింగ్ ప్రక్రియను నాగార్జున నిర్వహించాడు. ఈ క్రమంలో ఎక్కువ మంది షాలిని బయటకు వెళ్లిపోవాలనే ఓటు వేశారు. దాంతో ఈ వారం షాలినీ బయటుక వెళ్లిపోయింది.

కావాలని చేశారా?

శనివారం ఎపిసోడో లో జరిగి పరిణామాలతో షాలినీ బాగా డిస్సపాయింట్ అయ్యింది. నాగార్జున వీడియోలు ప్లే చేస్తూ.. నిలబెట్టి దులిపేశాడు. దాంతో ఆమె ముఖం చూపించుకోలేకపోతోంది. అప్పటికప్పుడే తాను హౌస్ నుంచి బయటకు వెళ్లిపోడానికి రెడీగా ఉన్నట్టు వెల్లడించడంతో.. నాగార్జున బిగ్ బాస్ హౌస్ డోర్లు తీయించాడు. కానీ అక్కడితో ఆమెను ఆపేశారు. కానీ షాలినీ తనంతట గాను వెళ్లిపోతాను అంటే పంపించని బిగ్ బాస్. తాజాగా ఓటింగ్ పేరుతో ఆమెను బయటకు పంపే ప్లాన్ ను పక్కాగా అమలు చేసినట్టు అర్ధం అవుతోంది. షాలిని కూడా చాలా కామ్ గా హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
దక్షి కామెంట్స్
Image Credit : Star Maa

దక్షి కామెంట్స్

ముందుగా ఎలిమినేట్ అయ్యి.. స్టేజ్ మీదకు వచ్చిన దక్షికి నాగార్జున ఒక ప్రత్యేకమైన టాస్క్ ఇచ్చారు. ఇందులో భాగంగా హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లకు ఆమె కొన్ని సలహాలు, సూచనలు అందించింది. ముఖ్యంగా షాలినీ, రోహిత్‌ల తీరుపై దక్షి కీలక వ్యాఖ్యలు చేసింది. రోహిత్‌తో మాట్లాడుతూ.. ఆటను ఎప్పుడూ కేవలం హార్ట్‌తో కాకుండా మైండ్‌తో ఆడాలని, అప్పుడే ఆటలో రాణించగలవని సలహా ఇచ్చింది. షాలినీ కూడా తన ప్రవర్తన, మాటల తీరు మార్చుకోవాలని పరోక్షంగా హితవు పలికింది. నోటికి తాళం త్రిగుణ్ కు వేయాలంది.

33
ఎలిమినేషన్ కు కారణం?
Image Credit : Asianet News

ఎలిమినేషన్ కు కారణం?

వైల్డ్ కార్డ్ ఎంట్రీగా అడుగుపెట్టిన వారిలో కొందరు బాగానే ఇంప్రూవ్ అయినప్పటికీ, దక్షి మాత్రం ఆశించిన స్థాయిలో తన మార్క్ చూపించలేకపోయింది. ఆటపై ఫోకస్ పెట్టకపోవడం, పెద్దగా హైలైట్ కాకపోవడంతోనే ఆమె బయటికి రావాల్సి వచ్చిందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు, సీక్రెట్ రూమ్ నుంచి రీ ఎంట్రీ ఇచ్చిన షాలినీ తీరు కూడా హౌస్‌లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఆమె చేసే రచ్చ, తోటి సభ్యులతో వ్యవహరించే తీరు ప్రేక్షకులకు తీవ్ర చిరాకు తెప్పించడంతో ఆమె కూడా ఈ వారం ఎలిమినేషన్ బారిన పడక తప్పలేదు. మొత్తానికి ఈ డబుల్ ఎలిమినేషన్ హౌస్‌లోని మిగతా కంటెస్టెంట్లకు గట్టి వార్నింగ్ లాంటిదని చెప్పవచ్చు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
బిగ్ బాస్ తెలుగు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10: ఏడో వారం డబుల్‌ ఎలిమినేషన్‌, దక్షితోపాటు షాలిని ఎలిమినేట్‌.. కారణం ఇదే
Recommended image2
Bigg Boss Shalini: దుమ్ము దులిపేసిన నాగార్జున, షాలినికి ఫ్యూజులు అవుట్..మోకాళ్లపై నిల్చుని బతిమాలిన రోహిత్
Recommended image3
Bigg Boss 10 Elimination: బిగ్‌ బాస్‌ తెలుగు 10 ఏడో వారం ఎలిమినేషన్‌.. రెండో వారంలోనే ఆమె ఔట్‌
Related Stories
Recommended image1
విషపూరిత పామును తిన్నాక కూడా ముంగిస ఎలా బతుకుతుంది? ఆ విషం ఏమవుతుంది?
Recommended image2
ANR: సావిత్రితో నటించడానికి నో చెప్పిన ఏఎన్నార్.. ఎన్టీఆర్ మహానటి కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved