బాలీవుడ్ రైజింగ్ హీరో ఆయుష్మాన్ ఖురానా నటించిన బదాయి హో చిత్రం గత ఏడాది విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. సీనియర్ నటి నీనా గుప్తా ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించారు. 60 ఏళ్ల వయసులో ప్రెగ్నెన్సీ అనే కాన్సెప్ట్ తో వచ్చిన ఈ చిత్రం ఎమోషన్, వినోదం పరంగా ప్రేక్షకులని ఆకట్టుకుంది. 

ప్రస్తుతం సౌత్ లో హిట్టైన సినిమాలో హిందీలో, హిందీలో హిట్టైన చిత్రాలు సౌత్ లో రీమేక్ కావడం సాధారణ విషయంగా మారింది. బదాయి హో చిత్ర రీమేక్ హక్కులని అగ్ర నిర్మాత దిల్ రాజు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనికపూర్ ఏ చిత్ర తెలుగు రిమేక్ లో నిర్మాణ భాగస్వామిగా ఉండనున్నట్లు తెలుస్తోంది. 

ఈ చిత్రంలో నటించే హీరో కోసం ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. నాగ చైతన్య ఈ చిత్రంలో నటించేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చిత్రానికి చైతు 40 రోజుల డేట్స్ కేటాయించాడట. మరోవైపు ఆర్ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతితో కూడా చర్చలు జరుగుతున్నాయి. చైతు తదుపరి చిత్రాల గురించి త్వరలో ఓ క్లారిటీ రానుంది.