తెలుగు ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్న షో బిగ్ బాస్ షో ఎన్టీఆర్ స్క్రీన్ మీద వుండే శ‌ని ఆదివారాలు తెలుగు జ‌నం టీవీల ముందే కూర్చుంటున్నారు అందుకే షోని సినిమాల ప్ర‌చారానికి బాగా వాడుకుంటున్నారు హిరోలు ఇప్పుడు హీరో నాగ చైతన్య కూడా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లానున్న‌డ‌ని  తెలుస్తోంది

బిగ్ బాస్ షో తెలుగు ప్రేక్షకులను అలరిస్తోందన్న నిజం క్లియర్ అయింది. మిగిలిన రోజుల మాట ఎలా వున్నా, ఎన్టీఆర్ స్క్రీన్ మీద వుండే శని, ఆది వారాలు మాత్రం కచ్చితంగా తెలుగు జనాలు టీవీల ముందు అతుక్కుపొతున్నారు.

అందుకే సినిమా జనాలు కూడా తమ సినిమాల ప్రచారానికి బిగ్ బాస్ హౌస్ మాంచి వేదిక అనుకుంటున్నారు. ఇప్పటికే రానా, విజయ్ దేవరకొండ లాంటి వాళ్లు వీకెండ్ లో బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి సందడి చేసి వచ్చారు. ఇప్పుడు యంగ్ హీరో నాగ్ చైతన్య కూడా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లాలని ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది.

 చైతన్య హీరోగా నటించిన యుద్ధం శరణం సినిమా ఈనెల 8న విడుదల అవుతోంది. ఈ సినిమా విడుదల సందర్భంగా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లాలని చైతన్య అనుకుంటున్నట్లు వినికిడి. ఈ మేరకు ఎన్టీఆర్ కు చెప్పినట్లు కూడా తెలుస్తోంది. అయితే విడుదల ముందు వారం ఇది పాజిబుల్ అవుతుందో, అవదో తెలియదు. విడుదల మర్నాడు వచ్చే శని లేదా ఆ మర్నాడు ఆదివారంలో చైతూ బిగ్ బాస్ లోకి వెళ్తే, వెళ్లే అవకాశం అయితే వుంది